Ads
సినిమా నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోలు చాలా మంది ఉన్నారు. అయితే వారికి మొదటి సినిమా తీసుకురావడానికి మాత్రమే సినిమా నేపథ్యం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలి అంటే వాళ్ళు కష్టపడి సినిమా సినిమాకి తమని తాము నిరూపించుకోవాల్సిందే. అలా సినీ ఇండస్ట్రీ నేపథ్యంతోనే మొదటి సినిమా చేశారు. ఆ తర్వాత ప్రతి సినిమాకి తనని తను మార్చుకుంటూ ఇప్పుడు సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు మహేష్ బాబు.
ఇటీవల మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. అవన్నీ దాటుకొని ఇప్పుడు సూపర్ స్టార్ స్థాయికి అది గారు. కృష్ణ గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటిలో కొన్ని సినిమాలు కమర్షియల్ సినిమాలతో పాటు, ఎక్స్పరిమెంటల్ సినిమాలు కూడా చేశారు. దాంతో నటుడిగా కూడా తనని తాను నిరూపించుకున్నారు. ఎక్స్పరిమెంటల్ సినిమాలు చాలా వరకు కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు.
Ads
అందుకే కొన్నాళ్ల నుండి ఎక్స్పరిమెంటల్ సినిమాలు పక్కనపెట్టి కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే, తన సినిమాలని నమ్మి డబ్బులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి న్యాయం జరగడం, వారికి లాభం అవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు కమర్షియల్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అయితే కమర్షియల్ సినిమాల్లో కూడా ఏదో ఒక మెసేజ్ ఉండేలాగా చూసుకుంటున్నారు.
ఇటీవల గుంటూరు కారం సినిమాతో ఒక కొత్త రోల్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రిపరేషన్ పనిలో ఉన్నారు. ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. మహేష్ బాబు రెండవ సినిమాకి 70 లక్షల పారితోషకం తీసుకున్నారు. అప్పుడు ఇదే విషయాన్ని పేపర్ లో కూడా వేశారు. అదే సమయంలో ఇంకా చాలా మంది యంగ్ హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ మహేష్ బాబు ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారు అని ఇందులో చెప్పారు.
ALSO READ : మధ్యతరగతి వాళ్ళు అంటే ఇలా ఉంటారు..! మిడిల్ క్లాస్ పరిస్థితులని కరెక్ట్ గా చూపించిన సినిమా ఇదే..!