ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చేసింది రెండే సినిమాలు…రెండిట్లో ఒకే లాంటి పాత్ర.!

Ads

ఇండస్ట్రీలో ఏ హీరో, హీరోయిన్ అయినా ఏదైనా సినిమాలో ఒక పాత్రలో చనిపోయారంటే ఆ తర్వాత సినిమాలలో కూడా అలాంటి పాత్రలే వస్తూ ఉంటాయి. చాలామంది నటీనటులకు ఈ విషయం నచ్చదు. అందుకే వాళ్ళు ఒకే రకం పాత్రను ఎంచుకోకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా స్టార్ హీరో, హీరోయిన్లు ఒకే రకమైన పాత్రలు చేస్తే అభిమానులకు విసుగు వస్తుంది. అందుకే కొత్త సినిమాలతో, కొత్త పాత్రలతో అభిమానులను మెప్పించడానికి ప్రయత్నిస్తారు.

కానీ అవే పాత్రలు చేసుకుంటూ పొతే హీరో హీరోయిన్లకు అవకాశాలు రాను రానూ తగ్గిపోతూ ఉంటాయి. ఇలాగే ఒక హీరోయిన్ కి కూడా తను చేసిన రెండు సినిమాలు సుమారు ఒకేలా ఉన్నాయని దాని తర్వాత వచ్చే ఆఫర్లు కూడా అలాంటి పాత్రకు సంబంధించినవే వచ్చాయంట.ఇంతకీ ఆమె ఎవరో కాదు అన్షు.

ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అన్షు క్యారెక్టర్ సినిమా సగంలో చనిపోతుంది. అలాగే నాగార్జునతో మన్మధుడులో నటించిన అన్షు పాత్ర ఈ సినిమాలో కూడా చనిపోవడంతో అన్షు కి వచ్చిన రెండు మూడు తదుపరి సినిమా అవకాశాలలో కూడా తన పాత్ర చనిపోయే లాంటి క్యారెక్టర్లే వచ్చాయట. కానీ రెండు సినిమాలు మాత్రమే చేసి…సినిమాలకు దూరమయ్యారు అన్షు.

 

View this post on Instagram

 

A post shared by Anshu Saggar (@actressanshuofficial)

Ads

పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతుంది అన్షు. ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పాపులర్ అవడం వలన చాలామంది మన్మధుడు సినిమాలో అన్షు డైలాగులను రీల్స్గా చేస్తున్నారు. వాటి కింద అన్షు తన అకౌంట్ నుంచి అభినందనలు పెడుతూ వాళ్లని మెచ్చుకుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా కనిపిస్తున్న అన్షు ని అభిమానులు తిరిగి సినిమాలు చేయొచ్చు కదా అని కామెంట్లలో అడుగుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anshu Saggar (@actressanshuofficial)

Previous articleసినిమాలో అలా … రియల్ లైఫ్ లో ఇలా… సిద్ధు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.!
Next articleపోలీస్ ట్రైనింగ్ సమయంలో.. “జుట్టు” ని చిన్నగా ఎందుకు కట్ చేస్తారో తెలుసా…?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.