సినిమాలో అలా … రియల్ లైఫ్ లో ఇలా… సిద్ధు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.!

Ads

డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సైలెంట్ గా, ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా, లాభాలు తెచ్చి పెట్టింది. కరోనా టైం లో ఈ సినిమా వచ్చింది. కరోనా అప్పుడప్పుడే తగ్గుతూ ఉండడంతో నిర్మాతలు రిస్క్ చేసి సినిమాని థియేటర్లలో విడుదల చేశారు. సినిమాకి మాత్రం ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. టిల్లు పాత్ర అయితే చాలా మందికి నచ్చింది. దాంతో ఇప్పుడు టిల్లు స్క్వేర్ పేరుతో ఈ సినిమా సీక్వెల్ వస్తోంది.

sidhu jonnalagadda in tillu square event

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉండడంతో, హీరో హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. గతంలో అనుపమ ఇలాంటి పాత్రలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం ఛాలెంజ్ తీసుకొని ఈ పాత్ర చేశారు. కమర్షియల్ సినిమాల్లోనే ఒక మంచి పాత్ర తనది అని అనుపమ చెప్పారు.

ఈనెల చివరిలో ఈ సినిమా విడుదల అవుతుంది. దాంతో సినిమా బృందం అంతా కూడా ప్రమోషన్స్ పని మొదలు పెట్టారు. ఇటీవల ఓ మై లిల్లీ అనే ఒక పాట విడుదల చేశారు. ఈ పాట కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో మీడియా వాళ్ళు సినిమాకి సంబంధించిన ప్రశ్నలని సినిమా బృందాన్ని అడిగారు. అందుకు సినిమా బృందం సమాధానాలు చెప్పారు. అయితే ఈవెంట్ లో సిద్దు జొన్నలగడ్డ చేసిన ఒక పని మీద నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రెస్ మీట్ అన్నాక ఫోటోలు దిగుతారు. అది తెలిసిన విషయమే. హీరో, హీరోయిన్లు కలిసి కూడా ఫోటోలు దిగుతారు. మీడియా కోసం ఇలా ఫోటోలు ఇస్తారు.

sidhu jonnalagadda in tillu square event

Ads

అయితే, అనుపమ, సిద్దు పక్కన నుంచోని ఫోటో దిగుతున్నప్పుడు, సిద్దు, అనుపమని ముట్టుకోకుండా, కేవలం చెయ్యి అనుపమ భుజానికి కొంచెం దగ్గరగా పెట్టి ఫోటోలు దిగారు. సిద్దు హీరోయిన్లకి ఇంత రెస్పెక్ట్ ఇస్తారు అంటూ ఈ విషయం చూసిన వాళ్ళందరూ కూడా సిద్ధుని పొగుడుతున్నారు. “సినిమాలో పాత్ర కోసం ఎన్ని అయినా చేసినా కూడా, బయట ఆడవారు అంటే ఇంత గౌరవం ఉండడం అనేది చాలా గొప్ప విషయం” అని అంటున్నారు.

watch video :

 

View this post on Instagram

 

A post shared by Filmy Hunt (@filmyhuntlive)

Previous articleపిల్లల ముందు తల్లిదండ్రులు ఈ 5 పనులు అస్సలు చేయకూడదు..!
Next articleఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చేసింది రెండే సినిమాలు…రెండిట్లో ఒకే లాంటి పాత్ర.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.