పూర్తిగా మారిపోయిన ఈ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? కొత్త లుక్ సూపర్ కదా..?

Ads

తెలుగులో ఎన్నో సంవత్సరాలు సినిమాలు చేశాక, బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యారు ఒక నటి. ఆమె తండ్రి చాలా పెద్ద హీరో, తమ్ముళ్లు కూడా గుర్తింపు పొందిన హీరోస్. ఈమె కూడా హాలీవుడ్ షోస్ లో కెరీర్ మొదలుపెట్టి, తర్వాత తెలుగులోకి వచ్చారు. ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్లారు. ఆమె మరెవరో కాదు. మంచు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కొన్ని టాక్ షోస్ కూడా చేశారు.

this heroine new look

గుండెల్లో గోదారి, దొంగాట వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం హీరోయిన్ పాత్రలో మాత్రమే కాకుండా, ముఖ్య పాత్రల్లో కూడా నటించారు. కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశారు. అగ్ని నక్షత్రం అనే ఒక సినిమాలో మంచు లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు నటిస్తున్నారు. టీచ్ ఫర్ ఏ చేంజ్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, ఫ్యాషన్ షో ఏర్పాటు చేసి, అందులో వచ్చిన డబ్బులు అన్ని చారిటీకి ఇస్తారు. చాలా సంవత్సరాల నుండి ఇలా చేస్తున్నారు.

Ads

అలా కేవలం సినిమాల్లో రాణించడం మాత్రమే కాకుండా, సమాజానికి కూడా తనకి చేతనైనంత సేవ చేస్తూ ఉంటారు లక్ష్మీ ప్రసన్న. గత కొన్ని సంవత్సరాల నుండి లక్ష్మీ ప్రసన్న తెలుగులో పెద్దగా సినిమాల్లో నటించట్లేదు. యూట్యూబ్ లో లక్ష్మీ ప్రసన్న చాలా యాక్టివ్ గా ఉంటారు. తనని పేరుతోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని షేర్ చేస్తూ ఉంటారు. హోమ్ టూర్, డైలీ రొటీన్ వంటి వీడియోలు చేశారు.

ఇప్పుడు అందులో కూడా చాలా తక్కువగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ముంబైలో ఉంటున్నారు. తన కూతురి చదువుకి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న గుర్తింపు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతోనే అక్కడ ఉంటున్నారు. అంతే కాకుండా లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు కొత్త లుక్ లో లక్ష్మీ ప్రసన్న కనిపిస్తున్నారు. ఫోటోషూట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.

ALSO READ : ఫ్యామిలీ స్టార్ సినిమాకి “విజయ్ దేవరకొండ” రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? మొదట అలా అనుకొని..?

Previous articleఎంత మంచి భార్య అయినా కూడా…ఈ 4 విషయాలని తన భర్తకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు అంట.?
Next articleబేబీ “వైష్ణవి చైతన్య” తో పాటు… ఈ 9 హీరోయిన్లు పోషించిన గుర్తుండిపోయే పాత్రలు ఇవే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.