Ads
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి వయసు అనేది చాలా వరకు మిస్టరీగానే ఉంటుంది. ఈ విషయాన్ని ఎక్కువ మంది బయట చెప్పడానికి ఇష్టపడరు. అందుకు చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ వారి వయసు ఎక్కువ అయితే ఎలాంటి పాత్రలు వస్తాయో అని భయం కొంత మందికి ఉంటుంది.
కొంత మంది, సోషల్ మీడియాలో చాలా మంది వయసుని బట్టి కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడానికి వయసు అనే విషయాన్ని పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడరు.
కొంత మంది తప్పు వయసు చెప్పేవారు కూడా ఉంటారు. కానీ చాలా మంది వారి వయసు సరిగ్గానే చెప్తారు. అయితే చాలా మంది హీరోయిన్లు తాము 14 సంవత్సరాలకి ఇండస్ట్రీకి వచ్చాము అని, లేదా 16 సంవత్సరాలకు ఇండస్ట్రీకి వచ్చాము అని చెప్తారు. వారు చెప్పేవి ఎంత వరకు నిజం అనే విషయం పక్కన పెడితే, సాధారణంగా భారతదేశంలో ఉన్న చట్టం ప్రకారం 18 సంవత్సరాలు దాటాక కానీ ఒక అమ్మాయికి పెళ్లి చేయరు.
18 సంవత్సరాలకి ముందు ఒక అమ్మాయి ఎవరిని అయినా ప్రేమించినా కూడా మైనర్ కాబట్టి తెలిసి తెలియక చేసిన పని అని అంటారు. మైనర్ అయినప్పుడు తన నిర్ణయాలు తను తీసుకోలేదు. అలాంటిది, ఒక మైనర్ గా ఉన్న అమ్మాయి సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో ఎలా నటిస్తుంది? ఇటీవల మన్మధుడు సినిమా సమయానికి తన వయసు 16 సంవత్సరాలు అని హీరోయిన్ అన్షు చెప్పారు. మన్మధుడు సినిమా ప్రేమ కథ. అందులోని ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉంటాయి.
హీరోతో కలిసి డాన్స్ చేసే సీన్స్ కూడా ఉంటాయి. ఒక మైనర్ అమ్మాయి అలాంటి సన్నివేశాలు ఎలా చేస్తుంది? ఇటీవల వచ్చిన ఉప్పెన సినిమా సమయానికి కూడా కృతి శెట్టి వయసు చాలా తక్కువ అని అన్నారు. సినిమాలో ఇది టీనేజ్ ప్రేమ కథ గానే చూపించారు. కానీ సాధారణంగా చూస్తే ఒక 18 సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న అమ్మాయి ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు కదా అనే అనుమానం అందరికీ రావచ్చు.
Ads
అంత తక్కువ వయసు ఉన్న హీరోయిన్ ఇలాంటి సన్నివేశాలు చేయాలా వద్దా అనే నిర్ణయం ఎలా తీసుకుంటుంది అని అనిపిస్తుంది. అయితే దీని వెనుక ఒక ప్రాసెస్ ఉంటుంది. సాధారణంగా హీరోయిన్ వయసు 18 సంవత్సరాల కంటే చిన్న వయసు అయ్యుంటే, ఆమె సినిమాల ఎంపిక విషయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రుల ప్రమేయం కచ్చితంగా ఉంటుంది. లేదా తన వైపు నుండి మరొక గార్డియన్ అయినా ఉంటారు. వాళ్లు ఇలాంటి విషయాలు అన్నీ కూడా చూసుకుంటారు.
కానీ ఎక్కువ శాతం మాత్రం తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటారు. ఆ సినిమాకి సంబంధించిన వారు, ఆ హీరోయిన్ తల్లిదండ్రులతో మాట్లాడి, ఆ సీన్ ఎలా తీస్తారు అనేది వివరించి చెప్పి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం అనే ఒక భరోసా ఆ తల్లిదండ్రులకి కలిగితేనే అమ్మాయి అలాంటి సీన్స్ లో చేయడానికి అంగీకరిస్తారు. అప్పుడు హీరోయిన్ ని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు.
ఆమెకి ఇబ్బంది కలగకుండా అలాంటి సన్నివేశాలు చేస్తారు అని ఆమెకి కూడా నమ్మకం కలిగేలా చేస్తారు. మామూలుగా హీరో, హీరోయిన్ మధ్య సాధారణమైన సన్నివేశాలు అయితే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ ఏదైనా రొమాంటిక్ సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా గ్రీన్ స్క్రీన్ వాడతారు. లేదా గ్రాఫిక్స్ చేస్తారు. కానీ మరి ముఖ్యమైనది అయితే మాత్రం తెర వెనుక ఏదో ఒక జాగ్రత్త తీసుకొని, ఆ సీన్ షూట్ చేసి, తెర మీద మాత్రం హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ఒక సీన్ అని కనిపించేలాగా చూసుకుంటారు.
అంతే కాకుండా, అలాంటి సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో కూడా ఎక్కువ మంది టెక్నీషియన్లు ఉండకుండా చూసుకుంటారు. ఎటు నుండి అయినా సరే అంత చిన్న వయసు ఉన్న యాక్టర్ కి సమస్య రాకుండానే ధైర్యం చెప్తారు. అంతే కానీ హీరోయిన్ ని అసలు ఇబ్బంది పెట్టరు. ఆమెకి ఎంత మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా ఇలాంటి సీన్స్ లో చాలా వరకు హీరోయిన్ ఇన్వాల్వ్ అవ్వరు. ఎక్కువ టెక్నాలజీ మాత్రమే వాడుతారు. ఇప్పుడు చెప్పిన సినిమాల్లో కూడా అలానే సీన్స్ షూట్ చేశారు. అందుకే టీనేజ్ లో ఉన్న చాలా మంది సినిమాల్లోకి అంత ధైర్యంగా వస్తున్నారు.
ALSO READ : 58 ఏళ్ల హీరోకి జోడిగా 36 ఏళ్ల సమంత..! ఎవరంటే..?