పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఎంత వరకు చదువుకున్నారు అంటే..?

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పరిచయం అవసరం లేని వ్యక్తి. సినిమాల ద్వారా ఎంతో మందికి చేరువయ్యారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే, రాజకీయాల్లో కూడా ఉన్నారు.

మధ్యలో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాలు కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార పనుల్లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరి హర వీర మల్లు సినిమా అందులో మొదటిది. ఎప్పుడో మొదలైన ఈ సినిమా, మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగి మళ్ళీ జరుగుతుంది. పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ మొదటి పాన్-ఇండియన్ సినిమా. సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ముంబై గొడవల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా జరిగి ఇప్పుడు బ్రేక్ పడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. హీరోలలో టైర్ 1 హీరోలు, టైర్ 2 హీరోలు అని ఉంటారు. వారికి ఉన్న గుర్తింపుని బట్టి, వారు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే వసూళ్లను బట్టి ఈ క్యాటగిరిలోకి విభజిస్తారు. పవన్ కళ్యాణ్ టైర్ 1 హీరో కాబట్టి తీసుకునే రెమ్యూనరేషన్ కూడా అత్యధికంగానే ఉంటుంది.

Ads

పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తి 50 కోట్ల పైనే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వస్తున్న ఓజి సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రెమ్యూనరేషన్ లో వచ్చే డబ్బులని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తూ ఉంటారు. కొంత మొత్తం మాత్రమే తన దగ్గర ఉంచుకొని, మిగిలిన డబ్బులు అన్నిటిని కూడా ప్రజల సేవకి ఉపయోగించే వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటారట. అందుకే ఎంత సంపాదించినా కూడా అందులో చాలా వరకు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు.

ఇంక పవన్ కళ్యాణ్ చదువు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ 10 వ తరగతి వరకు చదువుకున్నారు. 1984 లో పవన్ కళ్యాణ్ 10 వ తరగతి పాస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఉన్న సెంట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పవన్ కళ్యాణ్ చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ కి తెలుగుతో పాటు, హిందీ, ఇంగ్లీష్ భాషల మీద కూడా మంచి పట్టు ఉంది. ఈ మూడు భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. అంతే కాకుండా ఖుషి సినిమాలోని ఏ మేరా జహా పాటని కూడా పవన్ కళ్యాణ్ రాశారు. ఇప్పుడు ఓజి సినిమా కోసం పవన్ కళ్యాణ్ మరాఠీ కూడా మాట్లాడుతున్నారు.

Previous articleఇందిరా గాంధీ భర్త అంత్యక్రియలు అలా ఎందుకు జరిగాయి..? “నేను ఫిరోజ్ గాంధీని ఇష్టపడలేదు” అని ఇందిరా గాంధీ ఎందుకు అన్నారు..?
Next article18 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్న హీరోయిన్ తో… రొమాంటిక్ సీన్స్ షూట్ చేసేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.