పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి మధ్య ఎంత వయసు తేడా ఉండడం మంచిది..?

Ads

ఈ రోజుల్లో చాలామంది ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. 30 ఏళ్లు దాటే వరకు కూడా పెళ్లి చేసుకోవడం లేదు. ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటామని అంటున్నారు. అయితే నిజానికి ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి..? పెళ్లి చేసుకునే అబ్బాయి ఎంత వయసు తేడా ఉండాలి అనే విషయాలని ఈరోజు తెలుసుకుందాం…

ఆడవాళ్ళల్లో మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళల్లో మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఆడవాళ్ళ వయసు తక్కువగా మగవాళ్ళ వయసు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. మెచ్యూరిటీ లెవెల్స్ సరిగ్గా ఉండాలంటే మూడు నుండి ఐదు ఏళ్ళ పడు తేడా ఉండాలి.

హార్మోన్లు ఆడవాళ్ళల్లో త్వరగా పని చేస్తాయి మగవాళ్లల్లో కొంచెం ఆలస్యంగా హార్మోన్లు పనిచేస్తాయి. ఆడపిల్లకి మగ పిల్లవాడికి మధ్య తేడా ఎదుగుదలలో ఇలా ఉంటుంది. ఆడపిల్లలు కాస్త ముందుగా మెచ్యూరిటీ లెవెల్స్ ని పొందుతారు మగ పిల్లవాడికి సంసారం చేయగలిగే సమర్థత కొంచెం ఆలస్యంగా వస్తుంది.

Ads

సో ఈ కారణంగా కూడా పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి మధ్య మూడు నుండి నాలుగేళ్లు తేడా ఉండడం మంచిది. ఆడవాళ్ళకి మెనోపాస్ వచ్చిన తర్వాత సెక్స్ మీద కోరికలు తగ్గిపోతాయి. మగవాళ్ళకి ఇది కొంచెం ఆలస్యంగా ఉంటుంది అందుకని వయసు తేడా ఉండాలి. అలానే సహజంగా చూసుకున్నట్లయితే మగ పిల్లలు తన కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని ఇష్టపడడం చూస్తూ ఉంటాం.

సర్వసాధారణంగా ఇలాగే ఇష్టపడుతూ ఉంటారు. చాలా రేర్ గా వయసు తేడా లేకుండా ఇష్టపడుతూ ఉంటారు. పైగా ఆడపిల్ల తన కంటే పెద్ద వాళ్ళని ఇష్టపడుతుంది తప్ప వాళ్ళ వయసు వాళ్ళని ఇష్టపడదు. మనసులో అటువంటి భావన కలగదు. వయసు తేడా ఉన్నప్పుడే ఇలాంటి భావన కలుగుతుంది.

వీటన్నిటి ప్రకారం మూడు నుండి ఐదు ఏళ్ల వయసు తేడా కచ్చితంగా అబ్బాయి అమ్మాయి మధ్య వుండాలి. అప్పుడే దాంపత్యం బాగుంటుంది. మరీ ముప్పై ఏళ్ళు వచ్చేయకుండా ప్రెగ్నెన్సీ ఆలస్యం కాకుండా పెళ్లి చేసుకోవాలి. లేట్ గా పెళ్లి చేసుకుంటే కూడా సమస్యలు వస్తాయి.

Previous articleఏసీబీ రైడ్స్ జరిగినప్పుడు.. పింక్ రంగులో వుండే ఈ సీసాలని ఎందుకు పెడతారు..?
Next articleపెళ్లి తరవాత సినిమాలకి దూరం అయిన 14 హీరోయిన్లు వీళ్ళే..!