పెళ్లి తరవాత సినిమాలకి దూరం అయిన 14 హీరోయిన్లు వీళ్ళే..!

Ads

సినిమాల్లో నటించే అవకాశం అందరికీ రాదు. ట్యాలెంట్, లక్ రెండూ కలిసొస్తేనే సినిమాలో నటించే ఛాన్స్ వస్తుంది. అయితే హీరోయిన్లగా కొన్ని ఏళ్ళు రాణించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా దూరమైన వాళ్ల గురించి ఈరోజు తెలుసుకుందాం…

ఊహ:

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది ఊహ తరవాత 1997 లో హీరో శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుంది. ఆ తరవాత సినిమాలు చేయలేదు.

నమ్రత:

సూపర్ స్టార్ మహేష్ బాబు ని నమ్రత పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే మహేష్ సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ నమ్రత ఇంట్లోనే ఉంటోంది. ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.

అసిన్:

ఈమె తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మైక్రోమాక్స్ సంస్థ సీఈవో రాహుల్ శర్మ ని ఈమె లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఆ తరవాత ఆమె సినిమాలకి దూరం అయ్యింది.

కీర్తి రెడ్డి:

కీర్తి రెడ్డి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. ఈమె కూడా పెళ్లి అయ్యాక సినిమాలకు దూరం అయ్యారు.

రేణు దేశాయ్:

రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఈమె కూడా చాలా మంది నటులు లాగే సినిమాలకి పెళ్లి అయ్యాక దూరం అయ్యారు. పవన్ కళ్యాణ్ ని వివాహం చేసుకున్నాక రేణు దేశాయ్ సినిమాలు చేయలేదు.

లయ:

లయ కూడా పెళ్లి అయ్యాక మూవీస్ కి దూరం అయ్యింది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా లయ చేసింది. ఆ తరవాత పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది.

Ads

రంభ:

చాలా మంది హీరోలతో రంభ నటించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రంభ. పెళ్లి తర్వాత ఈమె కూడా సినిమాలు చేయలేదు.

శిల్పాశెట్టి:

2009 లో ఈ అందాల భామ వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈమె కూడా సినిమాలు చేయలేదు.

అన్షు:

మన్మధుడు, రాఘవేంద్ర వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అన్షు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఈమె కూడా వివాహం తర్వాత సినిమాలకు దూరం అయిపొయింది.

శాలిని:

మలయాళ, తమిళ సినిమాలతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. హీరో అజిత్ ని ఈమె వివాహం చేసుకుంది. తర్వాత సినిమాల చేయలేదు.

మాధవి:

సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన మాధవి కూడా సినిమాలకి దూరం అయ్యింది. వివాహం తరువాత అమెరికా కి వెళ్ళిపోయింది.

రాధ:

రాధ బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాక సినిమాలు చెయ్యలేదు. ఈ అందాల తార 250కు పైగా సినిమాలలో నటించారు.

అంజలా జవేరి:

ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది వంటి సినిమాలు చేసింది ఈమె. వివాహం తర్వాత మాత్రం సినిమాలకు దూరం అయింది.

ముచ్చర్ల అరుణ:

సీతాకోక చిలుక, చంటబ్బాయ్ లాంటి సినిమాలతో ముచ్చర్ల అరుణ మెప్పించారు. వివాహం అయ్యాక అమెరికా కి వెళ్ళిపోయింది.

Previous articleపెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి మధ్య ఎంత వయసు తేడా ఉండడం మంచిది..?
Next articleఈ ఫోటో లో మోసం చేస్తున్న వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం..!