ఏంటి సిల్క్ స్మిత మళ్ళీ ఎలా వచ్చారు..?

Ads

కొంటె చూపులతో కుర్రాళ్ళ మతిని పోగోడుతూ ఉండేది సిల్క్ స్మిత. సిల్క్ స్మిత గురించి తెలియని వారు ఉండరు. సిల్క్ స్మిత సుమారు పాతికేళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీ ని తన కళ్ళతో శాసించింది. చాలా మంది సిల్క్ స్మిత కి ఫ్యాన్స్ అయిపోయారు. ఐటమ్ సాంగ్ వుంది అంటే కచ్చితంగా సిల్క్ స్మిత ఉండాలి అన్న రేంజ్ లో ఆమె పాపులర్ అయిపోయింది.

ఇంచుమించు దశాబ్దానికి పైగా సాగిన కెరియర్ లో సిల్క్ స్మిత వందల చిత్రాల్లో నటించేసి అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు సినిమాలలోనే కాదు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ సినిమాల్లో కూడా ఈమె నటించి అందరినీ ఆకట్టుకుంది. ఎంతో మంది టాప్ స్టార్ల తో ఈమె నటించింది. తన అందంతో వెండి తెరను ఒక ఊపు ఊపేసింది.

Ads

అకస్మాత్తుగా ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. ఇప్పటికి కూడా ఆమె మృతి పై ఎన్నో సందేహాలు ఉన్నాయి. చాలా మంది ఆమె మృతుని ఇంకా జీర్ణించుకోలేకపోతూనే ఉన్నారు. నాని హీరోగా వచ్చిన దసరా సినిమా మీరు చూశారా..? ఈ సినిమాలో సిల్క్ బార్ అని పెట్టి స్మిత ని ఓ సారి చిత్ర యూనిట్ గుర్తు చేసింది. సిల్క్ స్మిత ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారింది.

సిల్క్ స్మిత వైరల్ అవడం ఏంటి..? చనిపోయిన సిల్క్ స్మిత ఎలా తిరిగి వచ్చిందా అని ఆలోచిస్తున్నారా.. ఆ సిల్క్ స్మిత కాదండి జూనియర్ సిల్క్ స్మిత వచ్చిందండి. జూనియర్ సిల్క్ స్మిత అలియాస్ విష్ణుప్రియ.

చూడడానికి ఈమె కూడా సిల్క్ స్మిత లాగే కనబడుతుంది. ఈమె మరి ఎందుకు అలా సిల్క్ స్మిత లా మారింది అనేది తెలీదు. ఆఫర్ల కోసం అయి ఉండొచ్చు. సిల్క్ స్మిత బతికే ఉన్నారని ఈమెని చూసి అంతా భావిస్తున్నారు.

Previous articleX, Y, Z, Z+ కేటగిరీ భద్రత అంటే ఏమిటి..? ఎవరికి ఏ భద్రతాధికారులు వస్తారు..?
Next articleడైరెక్టర్ శంకర్ నటించిన సినిమాలు ఏమిటో మీకు తెలుసా..?