వామ్మో వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. మీరు చూసారా…?

Ads

పెళ్లి కుదిరిన తర్వాత పెళ్లి పనులు అన్నీ కూడా ఇరు కుటుంబీకులు చేసుకుంటూ ఉంటాయి. అయితే పెళ్లిని ఆహ్వానించడానికి వెడ్డింగ్ కార్డులని ఇస్తూ ఉంటారు. పెళ్లి కి రమ్మని ఆహ్వానించడానికి వెడ్డింగ్ కార్డ్స్ ని పంచుతారు. అందులో వధువు వరుడు వివరాలతో పాటుగా పెళ్లి ఎక్కడ జరుగుతుంది ఎన్ని గంటలకు జరుగుతుంది వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది.

నిజానికి పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఆర్థిక స్థితికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా పెళ్లిని జరుపుతూ ఉంటారు ఈ రోజుల్లో పెళ్లిళ్లని ఎంతో ఘనంగా జరుపుతున్నారు. ఆకట్టుకోవాలని అందరికీ నచ్చాలని సౌకర్యాలు అన్నీ కూడా ఉండాలని చూస్తున్నారు.

కొందరైతే ఒక రోజు మెహందీ ఒక రోజు సంగీత్ ఇలా చేస్తున్నారు. అయితే పెళ్లికి ఆహ్వాన పత్రిక చాలా ముఖ్యమైనది. చాలా మంది ఖరీదైన శుభ లేఖలని కూడా పంచుతూ ఉంటారు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో జరిగే వేడుకకు శుభలేఖలు ముద్రించి వాటిని ఇచ్చి పిలుస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క సారి వార్తల్లో కొన్ని విషయాలు సంచలనంగా మారుతూ ఉంటాయి.

Ads

తాజాగా ఒక పెళ్లి శుభలేఖ సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా మల్యాల కి చెందిన ఒక యువకుడు అదే చేసాడు. పక్కా తెలంగాణ యాస లో పెళ్లి కార్డు ని ప్రింట్ చేయించడం జరిగింది. ఫోక్ సాంగ్స్ రైటర్ సింగర్ గా రాణిస్తున్న మహేష్ గౌడ్ గురించి మీకు తెలిసే ఉంటుంది.

అతనికి పెళ్లి విషయం అయింది. ‘పొన్నం వోల్ల లగ్గం పిలుపు’ అంటూ తెలంగాణ యాస భాష ఉండేటట్టు వినూత్నంగా వెడ్డింగ్ కార్డును ప్రింట్ చేయించాడు. మహేష్ బంధువులు మిత్రులు అతడి క్రియేటివిటీకి ఫిదా అయ్యారు. వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది ఇలా ఉంటే ఇదివరకు మై విలేజ్ షో ద్వారా పాపులారిటీని పొందిన అనిల్ కూడా తన పెళ్లి పత్రికను ఈ విధంగానే ప్రింట్ చేయించడం జరిగింది.

Previous articleగూగుల్ లో వ్యక్తిగత వివరాలు ఏమి లేకుండా ఉండాలంటే… ఇలా చెయ్యండి..!
Next articleచెక్కుపై డబ్బులు రాసి చివర్లో ”ONLY” అని ఎందుకు రాస్తారు…?