ఈ హీరోయిన్ ఆమని మేనకోడలు అని మీకు తెలుసా.? ఏ సినిమాలో నటించారు అంటే.?

Ads

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది ఆమని. అయితే ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించిన ఆమె ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో తల్లి అత్త పిన్ని వంటి పాత్రలో నటిస్తూ అలరిస్తోంది.

ప్రస్తుతం ఆమని చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ఆమనికి సంబంధించిన ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఆమని వారసురాలు కూడా టాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ హీరోయిన్ ఆమని కి మేనకోడలు అవుతుందట. ఆ హీరోయిన్ ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.. ఆమె మారెవరో కాదు హీరోయిన్ హృతికా శ్రీనివాస్‌. బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న సౌండ్‌ పార్టీ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ..

Ads

హీరోయిన్‌ హృతికా శ్రీనివాస్‌ తన వ్యక్తిగత వివరాలు, బ్యాగ్రౌండ్‌ డీటెయిల్స్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీనియర్ నటి ఆమని తన అత్త అని తెలిపింది. తన చిన్నతనం నుంచి తన అత్త ఆమనిని చూస్తూ పెరిగానని అలా తనకు బాల్యం నుంచే సినిమాల మీద ఆసక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చింది హృతికా శ్రీనివాస్‌. తెలుగులో నాకు ఇది రెండో సినిమా అని తెలిపింది హృతికా. కాగా హృతికాకి ఆమని అత్త అన్న విషయం చెప్పగానే నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. హృతికా మొదట అల్లంత దూరాన సినిమాలో హీరోయిన్గా నటించగా ఇప్పుడు సౌండ్ పార్టీ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఇక బాల్యంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మెప్పించింది హృతికా.

Previous articleఅంతర్జాతీయ వేదికపై మలయాళీ మూవీ ‘వడక్కన్’
Next articleశివాజీలో నటించిన ఈ ఇద్దరు రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.