శివాజీలో నటించిన ఈ ఇద్దరు రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు.!

Ads

శివాజీ సినిమా మీ అందరికీ తెలిసే ఉంటుంది. డబ్బింగ్ సినిమా అయినా కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ గారి సినిమా కాబట్టి తెలుగు సినిమాకి ఉన్నంత పాపులారిటీ, క్రేజ్ ఉంటుంది. సినిమా విడుదలయ్యి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.

ఈ సినిమాలో రజినీకాంత్ శ్రియ ని ఇష్టపడతారు. ఈ విషయం శ్రియ కి చెప్తారు. కానీ శ్రియ ఒప్పుకోరు. అప్పుడు రజనీకాంత్ తన కుటుంబం మొత్తం తో కలిసి శ్రియ వాళ్ల ఇంటికి వెళ్తారు. అప్పుడు శ్రియ వాళ్ళ ఇంటి దగ్గర నివసించే ఒక వ్యక్తి తనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వాళ్ళని పెళ్లి చేసుకోమని రజనీకాంత్ తో వచ్చి చెప్తారు.

ఈ సీన్ కొంతమందికి కామెడీగా అనిపించింది, ఇంకొంతమందికి ఇన్ సెన్సిటివ్ గా అనిపించింది. అలా ఈ సీన్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టారా? ఈ పాటికే మీలో చాలా మందికి వాళ్ళెవరో అర్థమైపోయి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది శివాజీ సినిమా లోని ఇందాక చెప్పిన సీన్ లో నటించిన ఇద్దరు యాక్టర్స్. సినిమా కోసం వాళ్ల గెటప్ మార్చారట.

తెలుగు లో వీళ్ళ క్యారెక్టర్స్ పేర్లు అక్కమ్మ – జెక్కమ్మ. వీళ్లిద్దరు సినిమా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తారు. స్క్రీన్ టైం అంత ఎక్కువ సేపు ఉండదు. కనిపించింది 3,4 సీన్స్ లోనే అయినా కూడా చాలా పాపులర్ అయ్యారు. కానీ వీళ్ళ అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు. కేవలం పిక్చర్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ ఒక్క సినిమానే కాకుండా, వేరే ఏదైనా సినిమాలో నటించారా? లేదా? అన్న విషయం కూడా ఎవరికీ ఐడియా లేదు. వీళ్ళ గురించి వికీపీడియాలో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.

శివాజీ శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా. విడుదల అయిన సమయంలో ఎంతో మంది ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ గారి పర్ఫార్మెన్స్ తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం, వివేక్ కామెడీ టైమింగ్, ఫైట్స్, పంచ్ డైలాగ్స్, సెట్టింగ్స్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి. వీటన్నిటితో పాటు సుమన్ విలన్ గా చేయడం ఇంకొక హైలెట్.

Ads

మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ సినిమాలో రజనీకాంత్ శ్రియ కోసం తెల్లగా మారుతారు. తెల్లగా ఉన్న శివాజీని శ్రియ చూడంగానే ఒక పాట వస్తుంది. ఆ పాటలో రజనీకాంత్ తెల్లగా కనిపిస్తారు. ఆ పాట మొత్తం సి జి (కంప్యూటర్ జనరేటెడ్) లో తీశారట. దీని కోసం దర్శకుడు శంకర్, సినిమాటోగ్రాఫర్ కె.వి. ఆనంద్, మేకప్ ఆర్టిస్ట్ భాను, తో పాటు 25 మంది సి జి ఆర్టిస్ట్లు పనిచేశారట.

శివాజీ సినిమా బృందం ద హిందూ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం జాకీ అనే ఒక ఇంగ్లీష్ డాన్సర్ తో ముందు రజనీకాంత్ పోర్షన్ షూట్ చేశారట. తర్వాత మళ్లీ అదే పోర్షన్ రజినీకాంత్ గారి తో షూట్ చేశారట. జాకీ స్కిన్ రజినీకాంత్ గారి పై డిజిటల్ గా గ్రాఫ్ట్ చేశారట. జాకీ ఈ పాటలో ఒక మెయిన్ డాన్సర్ గా కూడా కనిపిస్తారట. ఈ పాటలో మొత్తం 630 షాట్స్ ఉన్నాయట. ఒకసారి 630 షాట్స్ జాకీ మీద, మళ్లీ అవే 630 షాట్స్ రజినీకాంత్ గారి మీద షూట్ చేశారట.

అది కూడా క్లారిటీ కోసం 4కె రిజల్యూషన్ లో షూట్ చేశారట. ముఖం, చేతులు, కాళ్లు మొత్తాన్ని 9000 స్కాన్డ్ ఫ్రేమ్స్ లో కాప్చర్ చేశారట. తర్వాత ఆ ఫ్రేమ్స్ వేరు చేసి రజినీకాంత్ ఫోటో కి తెల్ల చర్మాన్ని సాఫ్ట్ వేర్ ద్వారా మ్యాప్ చేశారట. ఈ ప్రొసీజర్ అంతా అవడానికి దాదాపు ఏడాది సమయం పట్టిందట. శివాజీ సినిమా 2007 లో జాతీయ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డ్ అందుకుంది.

ఇందాక పైన చెప్పిన కె.వి. ఆనంద్ ఎవరో కాదు రంగం, వీడొక్కడే, బందోబస్త్, బ్రదర్స్ సినిమా దర్శకులు. శివాజీ సినిమాకి మాత్రమే కాకుండా బాయ్స్, ముదల్వన్ (తెలుగులో ఒకే ఒక్కడు), కాదల్ దేశం (తెలుగులో ప్రేమ దేశం) తో పాటు ఇంకా ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా చేశారు కె.వి.ఆనంద్.

Previous articleఈ హీరోయిన్ ఆమని మేనకోడలు అని మీకు తెలుసా.? ఏ సినిమాలో నటించారు అంటే.?
Next articleచనిపోతున్న తన భార్య చివరి కోరిక తీర్చిన భర్త..రియల్లీ హ్యాట్సాఫ్.! ఇంతకీ ఆమె ఏం కోరిందంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.