”వాలి” చనిపోయేముందు ”రాముడి” ని అడిగిన ప్రశ్న ఇదే…!

Ads

రామాయణంలో చాలా పాత్రలు ఉన్నాయి. వాటిలో కొన్ని పాత్రలు ధర్మాన్ని నిలబెట్టాయి కానీ ఇంకొన్ని పాత్రలు ధర్మానికి విరుద్ధంగా ఉంటాయి. రామాయణం లో వాలి సుగ్రీవుల గురించి మీరు వినే ఉంటారు. వానర వీరులు వాలి సుగ్రీవులు పాత్రలు రామాయణం కిష్కిందకాండలో వస్తాయి. కబంధుడి చేతులని శ్రీరాముడు నరికేస్తాడు. ఆ తరవాత కబంధుడు శాప విమోచనాన్ని పొందుతాడు. అప్పుడు అతను రామా నీకు స్నేహితుడు అవసరం వెళ్లి సుగ్రీవుడి తో స్నేహం చెయ్యమని అంటాడు.

ఇప్పుడు ఇక అరణ్య కాండ పూర్తి అవుతుంది. కిష్కిందకాండ మొదలు అవుతుంది. వాలి, సుగ్రీవుల పాత్ర మొదలవుతుంది. వాలి మహాబలిశాలి. కిష్కింద రాజు ఇతను.

పది తలల రావణుడిని ఎదిరించి గెలిచిన శక్తివంతుడు ఇతడు. అసలు వాలి ఎందుకు అధర్మాన్ని అనుసరించాడు..? ఎందుకు అటువంటి పని చేయాల్సి వచ్చింది అనే విషయాలని ఇప్పుడు చూద్దాం. పూర్వము వాలి సుగ్రీవుడు అని ఇద్దరు సోదరులు ఉండేవారు సుగ్రీవుడు ఉత్తమమైన వాడు. వాలి చెడ్డవాడు. అయితే ఇద్దరూ చూసేందుకు ఒకేలాగే ఉండేవారు దానిని వాలి అదునుగా తీసుకున్నాడు ఎన్నో పాపాలను చేసి వాలి ఆ పాపాలని సుగ్రీవుడు మీదకి నెట్టేసేవాడు. అదేవిధంగా సుగ్రీవుడు చేసిన మంచి పనులన్నీ కూడా వాలి చేసినట్లుగా మార్చుకునేవాడు. ఒకరోజు వాలి సుగ్రీవుడు భార్య రుమని ఎత్తుకు వెళ్ళిపోతాడు.

Ads

వాలి ఈ ఘోరాన్ని తట్టుకోలేని సుగ్రీవుడు అక్కడ నుండి పారిపోయి రుష్యముఖ పర్వతం మీదకి వెళ్తాడు. ఆ పర్వతం మీదకి వెళ్తే తల వెయ్యి ముక్కలవుతుందని శాపం ఉండడం వలన వాలి అక్కడికి వెళ్ళాడు. కొన్నాళ్లకి అక్కడకి రామలక్ష్మణులు సీతని వెతుకుతూ వస్తారు వారితో పాటుగా వారి సైన్యం హనుమంతుడు అంతా కూడా వస్తారు. అయితే వాళ్ళని చూసిన సుగ్రీవుడు తనతో గొడవ పడడానికి వచ్చారని హనుమంతుడు తో గొడవపడతాడు. ఇంతలో రాముడిని చూసి తన బాధని తన సోదరుడు చేసిన దానిని చెప్తాడు. అది విన్న రామదండు తన భార్యని రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తానని చెప్తాడు.

ఇంతలో సుగ్రీవుడు వాలి చాలా శక్తివంతుడని చెప్తాడు ఇంతలో రాముడు తన విల్లు తీసి బాణాన్ని వదిలితే సప్తతాళ శ్రేణి కూలిపోతుంది. దాంతో సుగ్రీవుడికి రాముడు బలం అర్థమవుతుంది. తర్వాత వాలి సుగ్రీవుడు మధ్య యుద్ధం మొదలవుతుంది. చెట్టు చాటు నుండి రాముడు బాణాన్ని వదులుతాడు అది చూసి వాలి ఇలా చాటుగా చంపడం ధైర్యవంతుడి లక్షణమా అని అడుగుతాడు. అప్పుడు రాముడు సోదరుడిని కొట్టి తన భార్యని తీసుకురావడం న్యాయమా అని ప్రశ్నిస్తాడు అప్పుడు వాలి తాను చేసిన తప్పును తెలుసుకుంటాడు. అలానే రాముడు చేతులో చనిపోవడం తన భాగ్యమని చెప్పి తుది శ్వాసని ఏ విడుస్తాడు.

Previous articleపెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించడం అనే సంప్రదాయం వెనుక సైన్స్ ఉందా?
Next articleనిద్రపోయేటప్పుడు ఈ పొరపాటుని అస్సలు చెయ్యద్దు.. సమస్యలు తప్పవు..!