బాలకృష్ణ కూతుళ్లు సినిమాల్లోకి ఎందుకు రాలేదు..? కారణం ఇదేనా..?

Ads

బాలకృష్ణ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో హీరోగా నటించారు. పైగా నందమూరి కుటుంబానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అయితే సాధారణంగా ఇండస్ట్రీ లోకి హీరోలు కానీ హీరోయిన్లు కానీ తమ పిల్లల్ని కూడా నటులను చేస్తున్నారు. చిన్నపిల్లల్ని కూడా సినిమాల్లో నటించేలా చూస్తున్నారు. అయితే బాలకృష్ణ విషయానికి వస్తే…

బాలకృష్ణ మాత్రం తన కూతుర్లని ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. చాలా మంది నటులు ఇప్పటికే తమ కూతుర్లని కొడుకులని ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చారు.

balayya-babu-and-daugthers

Ads

 

కానీ బాలకృష్ణ మాత్రం తన కూతుర్లని ఇండస్ట్రీకి తీసుకురాలేదు. ఈ సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకు బాలయ్య తన కూతుర్లని సినిమాల్లోకి తీసుకురాలేదు సమస్య ఏమిటి అని… బాలకృష్ణకి ఇష్టం లేదా లేదంటే తన కూతుర్లకి ఇష్టం లేదా అని డిస్కషన్ కూడా అవుతూ ఉంటుంది. బాలయ్యకి ఇష్టం లేదా లేకపోతే తన కూతుర్లకే ఇష్టం లేదా..? అసలు సమస్య ఏమిటి అనే విషయానికి వస్తే…. బాలకృష్ణకి తన కూతుర్లు ఇండస్ట్రీలోకి వస్తే ఎటువంటి సమస్య లేదట. కానీ బాలయ్య కూతుర్లకి ఇండస్ట్రీలో గ్లామరస్ పరంగా స్క్రీన్ మీద కనపడడం ఏ మాత్రమూ ఇష్టం లేదు. దీని మూలంగానే వాళ్ళు ఇండస్ట్రీకి రాలేదు. కేవలం ఇండస్ట్రీలో గ్లామరస్ గా స్క్రీన్ మీద కనిపించడం ఇష్టం లేకపోవడం వలన దూరంగా ఉన్నారు. నారా బ్రాహ్మినికి సినీ ఇండస్ట్రీ కూడా నచ్చదు. కేవలం ఆమె వ్యాపారం పైనే తన దృష్టి పెడుతుంది.

ఇది ఇలా ఉంటే తేజస్విని కూడా ఇండస్ట్రీ లోకి రాలేదు. ఆమెకి సినిమా తెర మీద కనబడడం అసలు నచ్చదు. కేవలం తెర వెనుక ఉండడమే ఆమెకి ముఖ్యమని అనుకుంటూ ఉంటారు. స్క్రీన్ మీద బాలయ్య కూతుర్లు కనపడకుండా ఉండేదుకు కారణం ఇదే తప్ప మరే ఇతర కారణాలు లేవు. ఇక బాలయ్య విషయానికి వస్తే.. బాలయ్య ప్రస్తుతం సినిమాలతో బిజీగా వున్నారు. వీర సింహారెడ్డి అనే సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

Previous articleవిదేశాల్లో బ్యాన్ చేసినా… మన దేశంలో ఈ 13 ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు తెలుసా..?
Next article“ఫ్యామిలీ స్టార్” పోస్టర్‌పై కౌంటర్ వేసిన నెటిజన్ కి… “విజయ్ దేవరకొండ” రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.