వామ్మో ‘RRR’ కి ఆస్కార్ ప్రమోషన్స్ కి అన్ని కోట్లు ఖర్చు చేసారా ?? దీనితో ఒక సినిమా తీయొచ్చు !

Ads

నాటు నాటు పాట ఒక వండర్. నాటు నాటు పాట కి భారతీయ సినీ చరిత్ర లో ఎప్పటికీ ప్రత్యేకమే. రాజమౌళి ఎంతో అద్భుతంగా ఈ సినిమా ని తీసుకు రావడం జరిగింది. పైగా ఈ పాట
నామినేషన్స్ కి వెళ్లడమే కాదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం లో నాటు నాటు కి అవార్డు వచ్చింది. RRR సినిమా కి కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా సినిమా ఆ స్థాయి లోకి రావడానికి హెల్ప్ అయ్యాయి.

ఆస్కార్ అవార్డుల కోసం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది కూడా ఇండియా నుండి వచ్చిన బెస్ట్ 14 సినిమాలని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ మూవీ ని ఎంపిక చేయలేదు.

ఆస్కార్ అవార్డు 80 కోట్లు ఖర్చు చేసి కొన్నారు అని కూడా అంతా అన్నారు. ఇక తాజాగా కార్తికేయ ఈ విషయం గురించి చెప్పేసారు. అదేంటో చూద్దాం. ఆస్కార్ ప్రమోషన్ కి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు చేశారని టాక్ నడిచింది. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సినిమా ప్రమోషన్స్ కోసం 80 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నారని అంత డబ్బు పెట్టి 8 సినిమాలు తీసి ముఖాన్ని కొడతా అని వ్యంగంగా స్పందించారు. దీనిమీద నాగబాబు, రాఘవేంద్రరావు స్పందించడంతో వివాదం పెద్దదయింది.

Ads

ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్ల రూపాయలని ఖర్చు చేశారని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ దీనిపై స్పందించారు. అసలు ఎంత ఖర్చు చేశారు అనేది చెప్పారు.. ఓటిటిలో వచ్చినా కూడా థియేటర్లలోనే సినిమా ని చూడడానికి అంతా ఆసక్తి చూపించారని ఈ కారణంగానే అమెరికాలో సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నామని కార్తికేయ చెప్పారు. అందుకే కేవలం ఒకరోజు మాత్రమే 60 స్క్రీన్ లో షో వెయ్యాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ఒక్కరోజు అనుకుంటే నెలరోజులు గడిచింది.

ఆస్కార్ ఈవెంట్ లో కీరవాణి, చంద్రబోస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కాలభైరవులకు మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది. నామినీలకు, స్టేజ్ పై పర్ఫార్మ్ చేసే వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేశారు. సినిమాకి సంబంధించిన నటీ నటులకి కానీ టెక్నీషియన్లకి కానీ టికెట్ తప్పక తీసుకోవాలి. లోయర్ లెవెల్ సీట్ లో ఒక్క దానికి 1500 డాలర్లు ఖర్చు పెట్టాలి టాప్ లో కూర్చుని చూడడానికి మా ఫ్యామిలీలో నలుగురికి 750 డాలర్లు పెట్టి టికెట్ తీసుకున్నామని కార్తికేయ వెల్లడించారు.

అలానే ఆస్కార్ ని కొనడం అనేది పెద్ద జోక్ అని చెప్పేసారు కార్తికేయ. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూట్ ఇది అని అన్నారు. ఇంత ప్రేమ ని కొనడం సాధ్యమా అని కార్తికేయ అన్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్‌ల మాటల్ని కూడా కొనలేము అని కౌంటర్ ఇచ్చారు కార్తికేయ. అలానే ఈ సినిమా ప్రచారం కోసం మొదట ఐదు కోట్ల బడ్జెట్ ని అనుకున్నాం కానీ ఇంకో మూడు కోట్లు ఎక్స్ట్రా అయిందని మొత్తం ఎనిమిదిన్నర కోట్లు అయిందని చెప్పారు కార్తికేయ.

Previous articleయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కుంటి గుర్రంతో పోల్చిన జక్కన్న.. ఎందుకో తెలుసా..?
Next articleశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చెప్పింది మరోసారి అక్షరాలా మరో సారి రుజువయ్యింది ఈ సారి ఎక్కడంటే ?