శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చెప్పింది మరోసారి అక్షరాలా మరో సారి రుజువయ్యింది ఈ సారి ఎక్కడంటే ?

Ads

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతోంది. చాలా విషయాలు ఆయన చెప్పినవి అయ్యాయి. ఆయనకి ఉన్న అపారమైన జ్ఞానంతో భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చెప్పారు. ఆయన చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి. మీరు వాటి గురించి విని వుంటారు. కాల క్రమం లో వస్తున్న మార్పులను చూస్తే బ్రహ్మం గారు కాల జ్ఞానం లో ముందే ప్రస్తావించారని తెలుస్తోంది.

”కోరంకియను జబ్బుకోటిమందికి తగిలి, కోడిలాగ తూగిసచ్చేరయ” అని ఆయన కాలజ్ఞానం లో చెప్పారు. చెప్పినట్టే కరోనా మహమ్మారి రావడం అంతా ఇబ్బంది పడడం జరిగింది.

Ads

అలానే ఆయన చెప్పినట్టు ఇప్పటికే చాలా చోటు చేసుకున్నాయి. బ్రహ్మం గారు హేతువాదిగా ఉండే వారు. కానీ ఆధ్యాత్మిక వేత్త గా కనపడతారు ఆయన. క్రీ.శ. 1622 క్రీ.శ. 1693 మధ్య బ్రహ్మం గారు జీవించారు. చాలా మంది ప్రతి రోజూ గోమాతకి పూజలు చేస్తూ ఉంటారు. హిందువులు ఆవుని దైవం గా భావిస్తారు. పుట్టిన దూడలకు వేడుకలు చేయడం.. సీమంతం చేయడం ఇలా పలు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. గోవు కి సంబంధించిన విషయాలు క్షణం లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి.

తాజాగా ఒక సంఘటన జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో, గోకవరం మండలం, మురళీ నగర్ లో ఇది చోటు చేసుకుంది. ఒక దూడ ఎనిమిది కాళ్లతో జన్మించింది. ఆ దూడను చూడడానికి చాలా మంది అక్కడికి వచ్చారు. పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగానే 8 కాళ్లతో ఒక దూడ పుట్టింది. ఒక తల రెండు వెన్నెముకలు 8 కాళ్ల తో ఈ దూడ పుట్టింది. జన్యుపరమైన లోపాల వలన ఇలా పుట్టిందని వైద్యులు చెప్పారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే ఇది జరిగింది. బ్రహ్మం గారు కాల జ్ఞానం లో చెప్పినట్టే కలియుగాంతం ఆరంభం అవుతుందా..?

Previous articleవామ్మో ‘RRR’ కి ఆస్కార్ ప్రమోషన్స్ కి అన్ని కోట్లు ఖర్చు చేసారా ?? దీనితో ఒక సినిమా తీయొచ్చు !
Next articleసింహాసనం సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ అంత పెద్ద రిస్క్ చేసారని తెలుసా ? తేడా వచ్చి ఉంటే ఇంకోలా జీవితం అయ్యేది !