ఎన్టీఆర్ కన్నా ముందే రాజకీయాల్లోకి వెళ్ళిన తెలుగు నటుడు ఎవరో తెలుసా..?

Ads

ఇండియాలో సినీరంగాన్ని, రాజకీయాలను వేరు చేసి చూడలేం. ఇప్పటివరకు ఎంతోమంది నటినటులు రాజకీయాల్లోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో సొంతంగా పార్టీలు స్థాపించి, జాతీయ పార్టీలకు కూడా చెమటలు పట్టించినవారు ముఖ్యమంత్రులుగా కూడా ఎదిగారు.

Ads

ముఖానికి రంగులు పులుముకునే వ్యక్తులు పాలిటిక్స్ కి పనికి రారు అని చెప్పిన వారే మెచ్చుకునేలా చేశారు. అలా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి, అధికారంలోకి వచ్చినవారిని చూస్తే ఎంజీఆర్, జ‌య‌ల‌లిత పేర్లు వెంటనే గుర్తుకు వ‌స్తాయి. వారు మాత్రమే కాకుండా తెలుగు సినిమాల్లో అగ్రనటుడుగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడా సెన్సేషన్ సృష్టించిన ఎన్టీరామారావు గురించి కూడా అంద‌రికి తెలుసు.
అయితే తెలుగులో ఎన్టీఆర్ కన్నా ముందుగానే ఒక న‌టుడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడమే కాకుండా పాలిటిక్స్ లో రాణించారన్న సంగతి చాలా కొద్ది మందికి తెలుసు. అయితే ఎంతో మంది రాజకీయాలలోకి వచ్చినప్పటికి తొలిసారి పార్లమెంటు కి వెళ్ళిన వ్యక్తికి ఇచ్చే ప్రాముఖ్యత, స్థానం వేరుగా ఉంటాయి. అలా వెళ్ళిన మొదటి తెలుగు సినీ నటుడు కొంగ‌ర జ‌గ్గ‌య్య. ఆయన ఎన్టీరామారావుకు సన్నిహితుడు అవడం విశేషమని చెప్పవచ్చు. గుంటూరు జిల్లాలోని తెనాలి దగ్గరలో ఉండే గ్రామంలో నివసించే ధ‌న‌వంతుల ఫ్యామిలిలో జ‌గ్గ‌య్య జ‌న్మించాడు. ఆయన ఆకక్డే ఆంధ్రా క్రిస్టియ‌న్ కాలేజీలో చ‌దువుకున్నాడు. అయితే ఆ కాలేజీలోనే ఎన్టీరామారావు కూడా చదువుకున్నారు. అలా ఆ కాలేజీలోనే ఎన్టీఆర్, జగ్గయ్య మ‌ధ్య ప‌రిచయం ఏర్పడింది.జ‌గ్గ‌య్య సిని పరిశ్రమలో అడుగుపెట్టిన తరువాత ఆయనకు వ‌రుస‌గా మూడు ఏళ్ళ పాటు ఉత్త‌మ నటుడుగా అవార్డ్ అందుకున్నారు. జ‌గ్గ‌య్య, ఎన్టీఆర్ తో క‌లిసి నాట‌కాలలో నటించేవారు. జ‌గ్గ‌య్య విద్యార్థిగా ఉన్న‌ప్పటి నుండే పాలిటిక్స్ లో చురుకుగా ఉండేవారు. ఆయన జ‌య‌ప్ర‌కాష్ పెట్టిన ప్ర‌జా సోష‌లిస్ట్ పార్టీలో చేరారు. ఆ తరువాత 1956లో జ‌గ్గ‌య్య కాంగ్రెస్ లో చేరారు. ఇక 1967 లో ఒంగోలు నుండి కాంగ్రెస్ తరుపున పోటీ చేసాడు. ఆ ఎలక్షన్స్ లో గెలిచి ఆయన లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యాడు. ఆ ఎలక్షన్స్ లో జ‌గ్గ‌య్యకు ఎనబై వేల మెజారిటీ వచ్చింది.

Also Read: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 15 రీమేక్ సినిమాల లిస్ట్..

Previous articleప్రేమికుడు మూవీ షూటింగ్ ను మధ్యలోనే ఆపాలని గవర్నర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?
Next articleTop 10 Real Estate Builders and Developers in Hyderabad
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.