”కేఆర్ విజయ” కూతురు కూడా యాక్టరే.. ఇప్పుడు ఈ సీరియల్స్ చేస్తున్నారు తెలుసా….?

Ads

సీనియర్ నటి కేఆర్ విజయ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. అందరికీ ఆమె సుపరిచితమే. కేవలం కేఆర్ విజయ మాత్రమే కాకుండా ఆమె కూతుర్లు, చెల్లెళ్లు కూడా సిని ఇండస్ట్రీ లోకి వచ్చారు. కేఆర్ విజయ కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలో కూడా చేశారు, ఎక్కువగా కేఆర్ విజయ అమ్మవారి పాత్రలు చేసేవారు.

కనకదుర్గ అమ్మవారి పాత్ర చేసి ఆమె ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కేఆర్ విజయ కూతురు కూడా తన తల్లిలాగే మంచి నటి.

నిజానికి చాలా మందికి ఈ విషయం తెలియదు.కేఆర్ విజయ కూతురు పేరు అనూష. ఈమె 13వ ఏటనే మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది. తక్కువ సమయంలోనే ఆమె మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. అంత చిన్న వయసులో నటి అవడం నిజంగా అభినందించాల్సిన విషయం. 13వ ఏట ఆమె చేసిన సినిమాతో దర్శకులు నిర్మాతలు కూడా ఇంప్రెస్స్ అయిపోయారు. ఆ తర్వాత అవకాశాలు ఎక్కువగానే వచ్చాయి. మలయాళం లో ఎన్నో సినిమాల్లో నటించింది. మలయాళ సినీ పరిశ్రమలో ఒక పెద్ద హీరోయిన్ గా అనూష మారిపోయింది.

Ads

తర్వాత ఆమె తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చింది కానీ ఆమె హీరోయిన్ గా ఎదగలేక పోయింది. కానీ మలయాళంలో మాత్రం ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. రోజులు గడిచే కొద్దీ అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగు టీవీ సీరియల్స్ లో ఈమె నటిస్తోంది. నిన్నే పెళ్లాడతా, జయం, గృహలక్ష్మి వంటి సీరియల్స్ లో ఈమె కనపడుతోంది. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి.. మలయాళం లో అంత గుర్తింపు పొందిన ఈమె అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగు సీరియల్స్ చేస్తున్నారు.

Also Read: ఇండస్ట్రీలో యాభై ఏళ్ల నుండి వుంటున్న.. 17 మంది నటులు వీళ్ళే..!

Previous article”వేణు మాధవ్” నుండి ”ఎమ్ ఎస్ నారాయణ” వరకు.. టాలీవుడ్ కోల్పోయిన 10 మంది హాస్యనటులు వీళ్ళే..!
Next articleఆ మూవీ కోసం బాల‌కృష్ణ‌కు NTR పెట్టిన 3 షరతులు ఏమిటో తెలుసా?