జస్ట్ మిస్… లేకపోతే చెంప చళ్ళుమనేది..! బాలయ్య విగ్ సంఘటన గురించి ఈ డైరెక్టర్ ఏం అన్నారంటే..?

Ads

సినిమాల్లో చూపించేవి నిజం కాదు. ఇది చాలా వరకు అందరూ అనే మాట. సినిమాల్లో హీరోలు గంటకి ఒక హెయిర్ స్టైల్ మారుస్తూ ఉంటారు. నిజ జీవితంలో అలా జరగదు.

ప్రతి సారి హీరోలకి హెయిర్ కట్ అంటే కష్టం కాబట్టి విగ్ వాడుతారు. లేకపోతే హెయిర్ ఎక్స్టెన్షన్స్ వాడతారు.

హీరోయిన్లు కూడా ఇలాగే చేస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలా కృత్రిమ జుట్టు వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నందమూరి బాలకృష్ణ కూడా తన సినిమాల కోసం ఇలాంటి విగ్ వాడతారు. ప్రతి సినిమాకి హెయిర్ స్టైల్ మార్చడం అంటే కష్టం. కాబట్టి ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే బాలకృష్ణ విగ్ కి సంబంధించి ఒక సంఘటనని ప్రముఖ డైరెక్టర్ కే.ఎస్.రవికుమార్ చెప్పారు. ఈ డైరెక్టర్ బాలకృష్ణతో జై సింహా, రూలర్ సినిమాలకి దర్శకత్వం వహించారు.

ks ravikumar balakrishna wig incident

Ads

అయితే, ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ రవికుమార్ ఈ విధంగా చెప్పారు. “షూటింగ్ లో ఎవరైనా నవ్వుతున్నట్టు కనిపిస్తే బాలకృష్ణ ఆయనని చూసి నవ్వుతున్నారు అని అనుకుంటారు. కోపం వచ్చేస్తుంది. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతారు. ఒకసారి షూటింగ్ చేస్తున్న సమయంలో నా అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ ని ఫ్యాన్ నా వైపు తిప్పమని చెప్పాను. కానీ అతను అనుకోకుండా బాలకృష్ణ వైపు తిప్పాడు. దాంతో బాలకృష్ణ విగ్ పక్కకి జరిగింది. దాంతో శరవణన్ నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకి కోపం వచ్చి, “ఎందుకు నవ్వుతున్నావు?” అని అడిగారు.”

“ఆ టైంలో శరవణన్ ని కొట్టేస్తారు ఏమో అని భయపడి, నేను వెళ్లి, “సర్ అతను మన అసిస్టెంట్ డైరెక్టర్” అని చెప్పాను. అయినా కూడా బాలకృష్ణ కోపం తగ్గలేదు. “నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో” అని నేను శరవణన్ మీద అరిచాను. అప్పుడు బాలకృష్ణ కూల్ అయ్యారు” అని చెప్పారు. ఇదే ప్రెస్ మీట్ లో పక్కన హన్సిక ఉన్నారు. ఈ విషయం విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అంతా నవ్వారు. హన్సిక కూడా నవ్వారు. కానీ ఇది చూసిన చాలా మంది మాత్రం, “ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఏం ఉంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video :

Previous articleగుర్తుపట్టలేనంతగా మారిపోయిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” హీరోయిన్..! ఇలా అయిపోయారేంటి..?
Next articleకమెడియన్ ఆలీ అల్లుడు ఎవరు..? అతని బ్యాగ్రౌండ్ ఏమిటంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.