గుర్తుపట్టలేనంతగా మారిపోయిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” హీరోయిన్..! ఇలా అయిపోయారేంటి..?

Ads

కొంత మంది నటులు చాలా సినిమాల్లో నటించినా కూడా ప్రేక్షకులకి అంత పెద్దగా గుర్తుండరు. కానీ కొంత మంది నటులు మాత్రం, నటించిన కొన్ని సినిమాలు అయినా కూడా ప్రేక్షకులకి అలా గుర్తుండిపోతారు. వారిలో ఈ హీరోయిన్ కూడా ఒకరు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా అని గుర్తింపు సంపాదించుకుంది. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు హ్యాపీడేస్ సినిమాకి పోలికలు వచ్చాయి. ఈ సినిమాతో శేఖర్ కమ్ముల కొంత మంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు.

life is beautiful heroine zara shah latest look

అంతే కాకుండా, యంగ్ నటులు ఎక్కువగా ఉండడంతో, ఈ సినిమాకి హ్యాపీడేస్ సినిమాకి పోలికలు వచ్చాయి. కానీ రెండు సినిమాలు పోల్చి చూస్తే మాత్రం డిఫరెంట్ సినిమాల లాగానే ఉంటాయి. దాంతో థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు యావరేజ్ టాక్ సంపాదించుకుంది. కానీ తర్వాత టీవీలో టెలికాస్ట్ చేసినప్పుడు మాత్రం మంచి టాక్ సంపాదించుకుంది. సాధారణ జీవితంలో మాట్లాడుకునే సంభాషణల లాగానే ఈ సినిమాలో డైలాగ్స్ ఉంటాయి అంటూ చాలా మంది పొగిడారు.

life is beautiful heroine zara shah latest look

Ads

రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది అని, పాత్రలు కూడా తాము రోజు చూసేవారి లాగానే అనిపించారు అని చాలా మంది అన్నారు. ఈ సినిమాలో అలా గుర్తుండిపోయిన పాత్ర లక్ష్మి పాత్ర. ఆర్థికంగా మంచి స్థాయికి ఎదగాలి అని, చదువుకొని తన తండ్రికి సహాయపడాలి అని అనుకునే ఒక అమ్మాయి పాత్ర. ఆ పాత్రలో నటించిన నటి పేరు జరా షా. జరా షా ఒక మోడల్. తర్వాత సినిమాల్లో నటించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా థియేటర్లలో టాక్ ఎలా ఉన్నా కూడా జరాకి మంచి మార్కులు పడ్డాయి. ఆమె నటన బాగుంది అని చాలా మంది అన్నారు.

life is beautiful heroine zara shah latest look

ఈ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించిన భాయ్ సినిమాలో నాగార్జున చెల్లెలి పాత్రలో నటించారు. ఆ తర్వాత అయితే 2.0 సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత మళ్లీ పెద్దగా కనిపించలేదు. కానీ జరా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా విడుదల అయ్యి 12 సంవత్సరాలు దాటింది. దాంతో అప్పటికి ఇప్పటికి జరాలో చాలా మార్పు వచ్చింది. చాలా మంది హీరోయిన్లు మధ్యలో బ్రేక్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. జరా కూడా మళ్లీ సినిమాల్లోకి వస్తారు ఏమో.

ALSO READ : ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది..! ఎవరో తెలుసా..?

Previous article38 ఏళ్ళ రామ్ చరణ్ కి తల్లిగా… 37 ఏళ్ళ హీరోయిన్..! ఇదెక్కడి వింత..?
Next articleజస్ట్ మిస్… లేకపోతే చెంప చళ్ళుమనేది..! బాలయ్య విగ్ సంఘటన గురించి ఈ డైరెక్టర్ ఏం అన్నారంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.