Kushi Review : విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి ఆకట్టుకుందా..?

Ads

సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కించిన చిత్రం ఖుషి. గీతా గోవిందం తర్వాత సరైన హిట్ లేక సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు…మంచి హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్న సమంతకు.. ఈ మూవీ సక్సెస్ ఎంతో ముఖ్యం. అందుకే మూవీ ప్రమోషన్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడమే కాకుండా స్టేజ్ మీద ఆక్టివ్ ప్రదర్శనలు కూడా వీరిద్దరూ వెనుకాడ లేదు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం…

  • చిత్రం: ఖుషి
  • నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిశోర్, మురళి శర్మ, జయరామ్, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్
  • రచన & దర్శకత్వం: శివ నిర్వాణ
  • నిర్మాత: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
  • సినిమాటోగ్రఫి: మురళి జి
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి
  • సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్
  • విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023

why did samantha not attending kushi promotions

కథ:
ఈ మూవీ స్టోరీ కాశ్మీర్లో స్టార్ట్ అవుతుంది. ఉద్యోగం నిమిత్తం విప్లవ్ ( విజయ్ దేవరకొండ)కాశ్మీర్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అతను బేగం పేరుతో అందరూ పిలిచి ఆరాధ్యను ( సమంత) ఫస్ట్ సైట్ లోని లవ్ చేస్తాడు. అయితే సమంత నిజంగా ముస్లిం కాదు బ్రహ్మిణ్ అన్న విషయం బయటపడ్డాక అసలు కథ మొదలవుతుంది.

kushi review

విప్లవ్ క్రిస్టియన్ కావడంతో పెద్దల్ని ఒప్పించడం కాస్త కష్టం అవుతుంది. మతంత్ర వివాహానికి ఒప్పుకోలేదని…పెద్దలను ఎదిరించి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇక ఆ తర్వాత వీళ్ళ జీవితంలో చోటుచేసుకుని పరిణామాలు ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలను సృష్టిస్తాయి? వాటి నుంచి వాళ్లు ఎలా బయటపడతారు? అనేది స్క్రీన్ పైన చూడాల్సిందే…

kushi review

Ads

విశ్లేషణ:

మూవీలో ఫస్ట్ హాఫ్ కాస్త డిఫరెంట్ గా ఉంది. సారీ స్టోరీ చాలా రొటీన్ అనే చెప్పాలి. ఇప్పటికే ఇలా కులాంతర మతాంతర వివాహాలకు సంబంధించిన సినిమాలు ఎన్నో వచ్చాయి… బొంబాయి, ఏం మాయ చేసావే…లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇదే మెయిన్ పాయింట్ తో డెవలప్ చేయబడ్డాయి. అయితే ఈ సినిమాల్లో ఉన్నంత ట్విస్ట్ ఖుషి లో మాత్రం కనిపించడం లేదు.

kushi review

మరోపక్క సమంత, విజయ్ దేవరకొండ మాత్రం ఆన్ స్క్రీన్ పై రెచ్చిపోయారు. మొన్న ఆడియో ఫంక్షన్ లో ఇద్దరు డాన్స్ ప్రదర్శన పలు రకాల విమర్శలకు తెరలేపింది. అయితే అది ట్రైలర్ మాత్రమే…. ఇద్దరి మధ్య ఏ రేంజ్ కెమిస్ట్రీ ఉందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ యంగ్ జనరేషన్ ని విపరీతంగా ఆకట్టుకునే విధంగా ఉంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మంచి కం బ్యాక్ మూవీ అవుతుంది.

ప్లస్ పాయింట్లు:

  • ఈ మూవీలో సాంగ్స్ అన్ని సాలిడ్ హిట్స్ కావడం చిత్రానికి ప్లస్ పాయింట్.
  • విజయ్ దేవరకొండ ,సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మూవీని మరింత ఇంట్రెస్టింగా చేస్తుంది.
  • ఇది మంచి రొమాంటిక్ డ్రామానే కాకుండా కాస్త కామెడీ యాంగిల్ లో కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్:

  • స్టోరీ లైన్ కామన్ గా అనిపిస్తుంది.
  • అయితే స్టోరీలో రన్‌టైమ్ కాస్త తగ్గించి ఉంటే మరింత బాగుండేది.
  • డైరెక్టర్ రైటింగ్ మరియు స్క్రీన్ ప్లే పై కాస్త దృష్టి పెట్టాల్సింది.

రేటింగ్:

2.5/5

చివరి మాట:

మొత్తానికి ఖుషి ఒక మంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.

watch trailer :

Previous article1955 నుండి ఇప్పటివరకు ఆ గ్రామంలో “రాఖీ” పండగ జరుపుకోలేదు అంట…ఎందుకో తెలుసా.?
Next articleఈ ఫోటోలో ఉన్న ఒకప్పటి పాపులర్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.