కోడలు అత్తకి రాసిన ఉత్తరం ! ఈ రూల్స్ పెట్టకండి అత్తయ్య అంటూ … చూస్తే నవ్వు ఆపుకోలేరు..!

Ads

ఈ మధ్య కాలంలో ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. పూర్వం రోజులు మారిపోయాయి ఇది వరకులా అమ్మాయిలు ఇంటి పనులు అన్నీ చేయాలి అంటే కష్టం. ఒక పక్క ఆఫీస్ పని మరొక పక్క ఇంటి పనులు.. రెండూ మేనేజ్ చేసుకోవాలంటే 24 గంటలు సరిపోతాయా..? ఒక లెటర్ ని కోడలు అత్తకి రాసింది. కండిషన్స్ రూల్స్ గురించి మాట్లాడుతూ ఆమె ఈ లెటర్ ని రాసింది. ఆమె రాసిన ఉత్తరాన్ని చూస్తే నవ్వు ఆపుకోలేరు.

నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు నా కొడుకుని బాగా చూసుకో అమ్మ అని నాకు చెప్పారు.. కానీ అప్పగింతల సమయంలో మా ఇంట్లో వాళ్ళు నన్ను బాగా చూసుకోవాలి అని మీకు చెప్పారు. నా బిడ్డ జాగ్రత్త. బాగా చూసుకోండి అని మా అమ్మ నాన్న మీకు చెప్పారు.

కానీ మీరు నాకు అలా చేయలేదు. నా కొడుకుని బాగా చూసుకో అని నాకే చెప్పారు. నేను ఏమైనా పని మనిషినా అని రాసింది. అలానే అతను టీవీ చూస్తే నేను కాఫీ పెట్టి ఇవ్వాలి. ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సాక్సులని అలానే వదిలేస్తారు వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేయరు. సమయానికి భోజనం పెట్టాలి. వేడి నీళ్లు నుండి అన్ని నేనే పెట్టి ఇవ్వాలి. ఇలా బండెడు చాకిరీ చేయాల్సి వస్తోంది. కానీ నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, పనులు చేయను అని చెప్పను. నా పనికి కాస్త సహాయం చేయమని కూడా మీరు చెప్పక్కర్లేదు. కానీ తన పని తను చేసుకోమని చెప్పండి.

Ads

కానీ తన పని తాను చేసుకోమని కూడా చెప్పరు. ఎందుకంటే కోడలు చేస్తుందని.. అలానే మీరు నా కొడుకు గురించి నాకే బాగా తెలుసు అని అనుకుంటారు. కానీ మంచి కొడుకు అని మీరు చెప్పవచ్చు కానీ మంచి భర్త అని మీరు ఎలా చెప్తారు..? అలానే నా కొడుకు ఎంతో కష్టపడి ఇంటికి వస్తాడు. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని మీరు నాకు చెప్తారు.

కానీ నేను చేసే పని తో పోల్చితే అయన పని ఎంత..? ప్రతిసారి మీరు మీ కొడుకు కంఫర్ట్ గురించే మాట్లాడుతారు. కానీ నేనేమైనా ఖాళీగా ఉంటున్నానా..? ప్రియమైన అత్తగారు నేను ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయని అన్నారు. నేనేమైనా ఖైదీనా లేకపోతే జైల్లో ఉంటున్నానా..? మీ రూల్స్ ని గౌరవిస్తాను కానీ నేను నా నిర్ణయాలని ప్రేమిస్తాను అత్తయ్య అని కోడలు అత్తగారికి లేఖ రాసింది.

Previous articleట్రైన్ లో సీట్లు ఎందుకు బ్లూ కలర్ లో ఉంటాయి…?
Next articleచిరంజీవి ఆ మూవీలో అలా చేయడం నచ్చలేదు.. దర్శకుడు రాజమౌళి కామెంట్స్