మహేష్ బాబు కొత్త లుక్ చూశారా..? ఇలా మారిపోయారేంటి..?

Ads

ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమా కోసం ఇప్పటికే ప్రిపరేషన్ మొదలు పెట్టారు.

ఈ సినిమా కోసం మహేష్ బాబు ఒక స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది అని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాకి మహేష్ బాబు, రాజమౌళి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా, సినిమా విడుదల అయిన తర్వాత వచ్చే డబ్బుల్లో కొంత మొత్తాన్ని తీసుకుంటారు అనే వార్త కూడా వచ్చింది.

changes in guntur kaaram

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. సినిమాలో హీరోయిన్ కోసం ఇప్పటికే చాలా మంది పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్లు ఇద్దరు, ముగ్గురు పరిశీలనలో ఉన్నారు. సినిమా కథ ఇప్పటికే అయిపోయింది. ఇటీవల మహేష్ బాబు జర్మనీకి వెళ్లి వచ్చారు. కానీ అప్పటినుండి ఇప్పటివరకు మహేష్ బాబు లుక్ కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారు. అయితే మహేష్ బాబు కొత్త లుక్ ఫోటోలు బయటకు వచ్చాయి.

Ads

mahesh babu latest look

దిల్ రాజు గారి మేనల్లుడు ఆశిష్ పెళ్లి కోసం మహేష్ బాబుని పిలవడానికి దిల్ రాజు గారి కుటుంబం అంతా వెళ్లారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో దిల్ రాజు గారి కుటుంబంతో పాటు నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు ఉన్నారు. మహేష్ బాబు క్యాప్ పెట్టుకొని ఉన్నారు. కానీ ఆయన ఫేస్ మాత్రం కనిపిస్తోంది. జుట్టు పెంచుకొని, గడ్డంతో కనిపిస్తున్నారు. ఇది రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు గెటప్ అని అంటున్నారు. మహేష్ బాబు గెటప్ చాలా కొత్తగా ఉంది. ఫిట్ నెస్ విషయంలో కూడా మహేష్ బాబు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు.

అంతే కాకుండా మిగిలిన విషయాల్లో కూడా తనని తాను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గుంటూరు కారం సినిమాలో చాలా రోజుల తర్వాత మహేష్ బాబు డాన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా యుద్ధాలు నేర్చుకుంటున్నారు. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో మహేష్ బాబు పాత్ర గురించి మాత్రం ఎటువంటి వివరాలు బయటకు రాలేదు. మరి ఈ సినిమా గురించి మిగిలిన విషయాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే అంత వరకు ఆగాల్సిందే.

Previous articleసీత పాత్రకి సాయి పల్లవిని తీసేసి యాక్టింగ్ రాని ఈ హీరోయిన్ ని తీసుకున్నారా..? ఎవరంటే..?
Next article“రైతుల పేరు చెప్పి వచ్చాడు… ఇలా చేస్తున్నాడు..!” అంటూ “పల్లవి ప్రశాంత్” పై కామెంట్స్..? ఏం జరిగిందంటే..?