“రైతుల పేరు చెప్పి వచ్చాడు… ఇలా చేస్తున్నాడు..!” అంటూ “పల్లవి ప్రశాంత్” పై కామెంట్స్..? ఏం జరిగిందంటే..?

Ads

బిగ్ బాస్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామన్ మాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యి, సంచలనం సృష్టించాడు.

పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్ దీప్ టైటిల్ కోసం పోటీపడగా, ఆడియెన్స్ ఓట్లతో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. విన్నర్ గా ప్రశాంత్ 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఒక కారు, డైమండ్ నెక్లెస్ ను అందుకున్న విషయం తెలిసిందే.

Ads

ఆడియెన్స్ మనసులు గెలవడానికి హౌజ్ లో పల్లవి ప్రశాంత్ ఎంతో  కష్టపడ్డాడు. గేమ్స్, టాస్క్ లలో తన సత్తా చాటాడు. కామన్ మాన్ గా వెళ్ళిన అతనికి రైతు బిడ్డ అనే ట్యాగ్ చాలా ఉపయోగపడింది. షోలో తాను విన్నర్ అయితే ప్రైజ్ మనీని పేద రైతులకు పంచుతానని చెప్పాడు. ఒకసారి కాదు బిగ్ బాస్ వేదికగా పలు మార్లు ఇదే మాటను చెప్పాడు. బిగ్ బాస్ ముగిసి 2 నెలలు కావొస్తుంది.
పల్లవి ప్రశాంత్ డబ్బులను పేద రైతులకు పంచినట్టు లేదంటున్నారు. తాను రైతులకు డబ్బు ఇచ్చిన వీడియోలను కూడా షేర్ చేస్తానని అన్నారు. అలాగే రైతులకు పంచిన ప్రతి రూపాయికి కూడా లెక్క చెబుతానని ప్రశాంత్ వెల్లడించాడు. కానీ అతను రైతులకు డబ్బు సహాయం చేసిన సూచనలు కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ పార్టీలతో బిజీగా ఉన్నాడు. సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ హోదాలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక స్పై బ్యాచ్ అయిన శివాజీ మరియు ప్రిన్స్ యావర్ తో కలిసి పార్టీలలో ఎంజాయ్ చేస్తున్నాడని నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. శివాజీ ఓ సందర్భంలో పల్లవి ప్రశాంత్ ని హీరో ధనుష్ తో పోల్చారు. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లతో మూవీ తీస్తానని వెల్లడించారు. అయితే కెరీర్ లో ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీని రైతులకు పంచి పెట్టాలని అంటున్నారు.

Also Read: LAL SALAAM REVIEW : సూపర్ స్టార్ “రజినీకాంత్” తన కూతురి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 

 

Previous articleమహేష్ బాబు కొత్త లుక్ చూశారా..? ఇలా మారిపోయారేంటి..?
Next article”చంద్రబాబు నాయుడు” గారి పెళ్లి పత్రికని చూసారా.? ఎంత కట్నం తీసుకున్నారు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.