ఈ ఫోటోలో మహేష్ బాబు ధరించిన షర్ట్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Ads

ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పుడు రాజమౌళి సినిమా ప్రిపరేషన్ పనిలో బిజీగా ఉన్నారు, ఈ సినిమా కోసం ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలుపెట్టారు. కానీ వార్తలు ఏవి బయటకి రానీయట్లేదు. మహేష్ బాబు ఈ సినిమా కోసం రకరకాల లుక్స్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా లుక్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయితే మహేష్ బాబు అప్పుడప్పుడు మాత్రమే బయట కనిపిస్తూ ఉన్నారు. గత శనివారం మహేష్ బాబు మరొక ఫోటో బయటకు వచ్చింది.

ఇందులో మహేష్ బాబు తన పబ్లిసిస్ట్ విశ్వ, భార్య నమ్రత శిరోద్కర్ తో కలిసి ఉన్నారు. ఈ ఫోటో మహేష్ బాబు ఇంట్లో తీసిన ఫోటో అని ఫోటో చూస్తుంటే అర్థం అవుతోంది. ఇందులో మహేష్ బాబు వేసుకున్న టీ షర్ట్ గురించి చర్చలు మొదలయ్యాయి. సాధారణంగా హీరోలు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సరే అలాంటి స్టైల్ ఫాలో అవ్వాలి అని అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు టీ షర్ట్ చూశాక అలాంటి షార్ట్ కొనుక్కోవాలి అని అందరూ అనుకుంటున్నారు. అందుకే మహేష్ బాబు టీ షర్ట్ ఖరీదు ఎంతో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో ఒకసారి చేస్తే, దాని ఖరీదు తెలిసింది.

Ads

టీ షర్ట్ చూస్తే మామూలుగా ఉంది. ఖరీదు కూడా మామూలుగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఈ టీ షర్ట్ ఖరీదు 520 యూరోలు అని తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 46,390.22 రూపాయలు. ఈ టీ షర్ట్ ని బెర్లూటి అనే బ్రాండ్ వాళ్లు రూపొందించారు. ఇది మరైన్ బ్లూ కలర్ లో ఉంది. దాంతో ఈ టీ షర్ట్ చూసిన వాళ్ళందరూ కూడా ఖరీదు చూసి ఆశ్చర్యపోతున్నారు. చూడడానికి మామూలుగా ఉన్నా కూడా ధర ఇంత ఉంది ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : “పుష్ప” నుండి “సర్కారు వారి పాట” దాకా… “నెగిటివ్ టాక్”తో హిట్ ని అందుకున్న 7 సినిమాలు.!

Previous article“పుష్ప” నుండి “సర్కారు వారి పాట” దాకా… “నెగిటివ్ టాక్”తో హిట్ ని అందుకున్న 7 సినిమాలు.!
Next articleప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏదో తెలుసా..? ఎప్పుడు వచ్చిందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.