ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏదో తెలుసా..? ఎప్పుడు వచ్చిందంటే..?

Ads

ప్రకాష్ రాజ్. విలక్షణ నటుడు అనే ఒక మాటకి ప్రత్యక్ష ఉదాహరణ ప్రకాష్ రాజ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రేలంగి మావయ్యగా నటించిన ప్రకాష్ రాజ్, పోకిరి సినిమాలో ఒక విలన్ పాత్రలో నటించారు అంటే నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. అంతపురం సినిమాలో అంత పెద్ద వయసు ఉన్న వ్యక్తి పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్, ఠాగూర్ సినిమాలో ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు అంటే పోల్చుకోవడానికి అసలు ఒక ఆలోచనకి కూడా రాదు. ప్రకాష్ రాజ్ కేవలం నటుడు మాత్రమే కాదు. దర్శకుడు కూడా.

movie directed by prakash raj

ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా గురించి. భోజనం. ఈ కాన్సెప్ట్ మీద సినిమా రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. భోజనం ద్వారా ఒక ఇద్దరు మనుషులు కలవడం, వాళ్లు ప్రేమించుకోవడం అనేది ఇంకా అరుదుగా జరిగే విషయం. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజ్ ఉలవచారు బిర్యానీ సినిమాలో చూపించారు. సినిమా టైటిల్ వినడానికి చాలా కొత్తగా ఉంటుంది. సినిమా ఇంకా కొత్తగా అనిపిస్తుంది. 2014 లో వచ్చిన ఈ సినిమాకి ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా, శరత్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.

Ads

movie directed by prakash raj

స్నేహ, తేజస్, సంయుక్త హోర్నాడ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. మధ్య వయసులో ఉన్న ఒక జంట ప్రేమ కథ, యుక్త వయసులో ఉన్న ఒక జంట ప్రేమ కథ నడుస్తూ ఉంటాయి. రెండు వయసుల వాళ్లు మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. సాల్ట్ అండ్ పెప్పర్ అనే ఒక మలయాళ సినిమా ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. కానీ తెలుగు సినిమాకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలు వస్తున్న సమయంలో ఇలాంటి సినిమా చాలా కొత్తగా అనిపించింది.

movie directed by prakash raj

అందుకే ఈ సినిమా విడుదల అయినప్పుడు చాలా మంది ఈ సినిమాని అభినందించారు. ప్రకాష్ రాజ్ లో ఇంత మంచి దర్శకుడు ఉన్నారు అనేది కూడా అప్పుడే తెలిసింది. ఆ తర్వాత మన ఊరి రామాయణం అనే సినిమాకి కూడా ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఎన్నో అభినందనలు వచ్చాయి. అలాగే ప్రకాష్ రాజ్ కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ప్రకాష్ రాజ్ కి సినిమాల మీద ఎంత మంచి టేస్ట్ ఉంది అనేది ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు, నిర్మించిన సినిమాలు చూస్తూ ఉంటే అర్థం అవుతుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.

Previous articleఈ ఫోటోలో మహేష్ బాబు ధరించిన షర్ట్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
Next articleప్రభుదేవాతో సమానంగా డాన్స్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?