వైయస్ షర్మిల కొడుకు పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఎవరో తెలుసా..? ఒక్క ఫోటో సెషన్ కి ఎంత తీసుకుంటారు అంటే..?

Ads

సాధారణంగా ఏ ఈవెంట్ అయినా సరే ఈ మధ్య ఫోటోగ్రాఫర్స్ ఉండడం సహజం అయిన విషయం అయిపోయింది. చిన్న ఈవెంట్స్ నుండి ఘనంగా జరిగే వేడుకల వరకు ప్రతి ఈవెంట్ కి ఫోటోగ్రాఫర్లు ఉండడం ఎన్నో డిఫరెంట్ పోజులతో ఫోటోలు తీయడం వంటివి చూస్తూనే ఉంటాం.

సెలబ్రిటీల ఈవెంట్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఈవెంట్ కి చిన్నదైనా, పెద్దదైనా సరే స్టార్ ఫోటోగ్రాఫర్ ఉండాల్సిందే. అలా చాలా మంది సెలబ్రిటీల పెళ్లిళ్లకి ఫోటోలు తీసి ఫేమస్ అయిన వ్యక్తి జోసెఫ్ రాధిక్.

ys sharmila son wedding photographer

తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీల పెళ్లిళ్లకి జోసెఫ్ ఫోటోలు తీశారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఫోటోగ్రఫీలో ఈయన స్పెషలిస్ట్. ఉపాసన – రామ్ చరణ్, అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి, విగ్నేష్ శివన్ – నయనతార, ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ ఇలా వీళ్ళందరి పెళ్ళిళ్ళకి కూడా జోసఫ్ ఫోటోగ్రఫీ చేశారు. స్వతహాగా తెలుగువారు అయిన జోసెఫ్, ప్రపంచవ్యాప్తంగా తన ఫోటోగ్రఫీ ద్వారా ఫేమస్ అయ్యారు.

ys sharmila son wedding photographer

Ads

స్టోరీస్ బై జోసెఫ్ రాధిక్ పేరుతో తన సొంత ఫోటోగ్రఫీ స్టూడియో స్థాపించారు. ఇటీవల వైయస్ షర్మిల కొడుకు పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. రాజారెడ్డి – ప్రియ వివాహానికి జోసెఫ్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి పెళ్లి రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాలు కూడా అయ్యాయి. అయితే జోసెఫ్ ఒక్క ఫోటో సెషన్ కి ఎంత తీసుకుంటారు అని ఆసక్తి నెలకొంది.

ys sharmila son wedding photographer

జోసెఫ్ ఒక్క పోర్ట్రైట్ ఫోటో సెషన్ కి లక్షా పాతిక వేల రూపాయలు తీసుకుంటారు అని సమాచారం. అదనంగా టాక్స్ చార్జీలు కూడా పడతాయి. ఇది కేవలం ఒక్క ఫోటో సెషన్ కి మాత్రమే. పెళ్లి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఫోటో సెషన్ ఉంటుంది. అలా చూసుకుంటే దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటారు. అయితే ఒక ఈవెంట్ లో ఎన్నో ఫోటో సెషన్స్ అవుతాయి కాబట్టి దాదాపు 15-20 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఫోటోలు కూడా అంతే క్వాలిటీ గా ఉంటాయి. అందుకే ఈ ఫోటోగ్రాఫర్ కి అంత మంది అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీలు కూడా జోసఫ్ ఫోటోగ్రఫీ కావాలి అని అనుకుంటారు.

ALSO READ : “సురేఖ” పేరు మీద “ఉపాసన” మొదలు పెట్టిన ఈ కొత్త వెబ్ సైట్ లో… పదార్థాల ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Previous articleప‌వ‌న్ కళ్యాణ్ భార్య “అన్నాలెజ్‌నోవా'” ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆమె ఏం చేస్తూ ఉండేవారు అంటే..?
Next articleమహానటి “సావిత్రి” అభిమానికి రాసిన లేఖ చూశారా..? ఏం రాశారంటే..?