గుంటూరు కారం నక్కిలీసు గొలుసు సాంగ్ లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? ఇలా కనిపించి అలా మాయం అయ్యాడు..!

Ads

ఒకప్పుడు నక్కిలీసు గొలుసు పాట ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక మామూలు పల్లెటూరి పాట అంత ఫేమస్ అవడానికి కారణం ఢీ డాన్స్ షో. ఈ పాటకి డాన్సర్ పండు అమ్మాయి గెటప్ లో రెడీ అయ్యి డాన్స్ చేసి యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టించాడు.

యూట్యూబ్ లో ఈ డాన్స్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా దీని మీదే రీల్స్, షాట్స్, టిక్ టాక్ వీడియోలు కనిపించేవి.

man in guntur kaaram nakkilisu golusu song

అంత పెద్ద హిట్ అయిన ఈ పాటని చాలా సంవత్సరాల తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో వేశారు. ఈ సినిమాలో శ్రీలీల, మహేష్ బాబు కలిసి ఈ పాటకు డాన్స్ వేయగా ఇందులో పండు కనిపించడం విశేషం. ఈ పాట ఎంత వైరల్ అవ్వడానికి కారణం పండునే. ఈ పాట పండు ని కూడా చాలా ఫేమస్ చేసింది.

man in guntur kaaram nakkilisu golusu song

Ads

కానీ తర్వాత పండు చాలా రోజులు ఎవరికి కనిపించలేదు. ఎన్నో రోజుల తర్వాత మళ్లీ గుంటూరు కారం సినిమాలో ఈ పాటకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఈ పాటలో శ్రీ లీల డాన్స్ స్టెప్పులు వేస్తూ వేస్తూ మహేష్ బాబుని డాన్స్ చేయమని లాగుతుంది. ఇద్దరూ ఒక ఊపు మీద స్టెప్పులు వేస్తున్నప్పుడు స్క్రీన్ మీద పండు కనిపిస్తాడు. ఈ సీన్ కి, మహేష్ బాబు డాన్స్ కి గ్రేస్ కి థియేటర్లలో విజిల్స్ ఓ రేంజ్ లో పడ్డాయి.

man in guntur kaaram nakkilisu golusu song

గుంటూరు కారం సినిమాలో అన్ని పాటలు ఒక ఎత్తు అయితే ఈ పాటకు డాన్స్ మాత్రం ఇంకో ఎత్తు. మహేష్ బాబు లుంగీ వేసుకొని శ్రీ లీలతో తన డాన్స్ విశ్వరూపాన్ని ఈ సాంగ్ లో చూపించారు. అందరూ మర్చిపోయిన తర్వాత ఈ సాంగ్ ని మళ్లీ తెరపైకి తీసుకొని వచ్చి ఈ పాటని మరోసారి అందరికీ గుర్తు చేశారు డైరెక్టర్ త్రివిక్రమ్. అందులో పండుని చూసిన ప్రేక్షకులు ఒక్కసారి గా షాక్ అయ్యి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కనిపించాడని అనుకున్నారు.

watch video :

Previous articleవైయస్ షర్మిల కొడుకు పెళ్లికి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వట్లేదా..? కారణం ఇదేనా..?
Next articleవైయస్ షర్మిల కొడుకు పెళ్లి జరిగే ఈ “ఉమైద్ భవన్ ప్యాలెస్” లో పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.