వైయస్ షర్మిల కొడుకు పెళ్లి జరిగే ఈ “ఉమైద్ భవన్ ప్యాలెస్” లో పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ads

వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి ఇవాళ అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో జరుగుతోంది. ఇందుకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. కొంత కాలం క్రితం హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు.

ఇప్పుడు పెళ్లికి ముందు కూడా సంగీత్, మెహందీ వంటి ఫంక్షన్స్ జరిగాయి. ఇవాళ సాయంత్రం పెళ్ళి జరిగిన తర్వాత, రేపు ఉదయం ప్రార్థన, ఆ తర్వాత రేపు సాయంత్రం తలంబ్రాలు ఉంటాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది చాలా మంది సెలబ్రిటీలు ఫాలో అవుతున్న ఒక విషయం. బాలీవుడ్ టాలీవుడ్ నుండి ఎంతో మంది ప్రముఖులు డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు.

ys sharmila son

రాజస్థాన్ అనేది భారతీయ సాంప్రదాయానికి ప్రతీకగా ఉండే నగరం కాబట్టి, ఎక్కడ రాజుల కాలంలో నిర్మించిన ఎన్నో భవనాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది అక్కడే తమ పెళ్ళి జరుపుకున్నారు. ఇప్పుడు షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి కూడా ఇక్కడ జరగబోతోంది. ఉమైద్ భవన్ ప్యాలెస్ లో వీరి పెళ్లి జరుగుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న ఆరవ ప్రైవేట్ రెసిడెన్స్. ఇది జోధ్ పూర్ లో ఉంది. ఈ ప్యాలెస్ యొక్క ఓనర్ పేరు గజ్ సింగ్. దీన్ని తాజ్ హోటల్స్ వారు మేనేజ్ చేస్తారు. ఇందులో 70 గదులు ఉన్నాయి. హోటల్ స్టాఫ్ 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఇక్కడ ఒక్క రాత్రి కి రూమ్ ధర 30 వేల నుండి 35 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇది బేసిక్ రూమ్ ప్లాన్.

ys sharmila son

ఒకవేళ సపరేట్ సూట్ రూమ్స్ బుక్ చేయాలి అనుకుంటే, 55000 నుండి 3.2 లక్షల వరకు ధర ఉంటుంది. ఇందులో దాదాపు 200 మంది అతిథులకి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. అవన్నీ కలిపి 60 లక్షల నుండి 70 లక్షల వరకు ఒక్క రాత్రికి ఖర్చు అవుతాయి. వెడ్డింగ్ డెకరేషన్ కూడా చాలా ఖరీదు గానే ఉంటుంది. హోటల్ బిల్లింగ్స్ లో 50 నుండి 75% వరకు ఖర్చు ఉంటుంది. కానీ కొంత మంది సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వారిని ఆశ్రయించి, అక్కడికి తీసుకువెళ్లి, వారి టేస్ట్ కి తగ్గట్టు ఏర్పాటు చేయించుకుంటారు.

Ads

ys sharmila son engagement venue umaid bhavan

లైట్లు, పూలు ఇలా ఎన్నో వాడి డెకరేషన్ చేస్తారు. ఇంక భోజనం విషయానికి వస్తే, ఇందులో మూడు రెస్టారెంట్లు ఉంటాయి. దాదాపు 12 వేల నుండి ఒక్క మనిషికి భోజనం ధరతో మొదలు అవుతాయి. ఒకవేళ ఏదైనా ఈవెంట్ అయితే, అతిధులు వస్తే, దాదాపు 48 లక్షల వరకు ఫుడ్ కాస్ట్ అవుతుంది. ఇవి మాత్రమే కాకుండా, ఫౌంటెన్ కోర్ట్ యార్డ్ కి 3.5 లక్షలు, సన్ సెట్ పెవిలియన్ కి ఒక లక్ష, మెహ్రాన్‌ఘర్ కోటకి 4 లక్షలు, బారాదరి లాన్స్ కి 2.5 లక్షలు అవుతాయి. వీటన్నిటికీ అదనంగా 18 శాతం జీఎస్టీ పడుతుంది.

ys sharmila son engagement venue umaid bhavan

ఇది మాత్రమే కాకుండా, మళ్లీ బుకింగ్ ఖర్చులు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, అక్కడ ఏదైనా ఈవెంట్ ఉంటే డాన్సర్స్ ఖర్చులు, ఫోటోగ్రఫీ ఖర్చులు, మెహందీ ఆర్టిస్ట్ ఖర్చు, మేకప్ ఆర్టిస్ట్ ఖర్చు, లైటింగ్ ఖర్చు, సౌండ్ ఖర్చు కూడా అదనంగా ఉంటుంది. మొత్తానికి ఇందులో పెళ్లి కావాలి అంటే ఒక 7-8 కోట్లు అవుతాయి అని అంచనా వేస్తున్నారు. అంతకుముందు బాలీవుడ్ కి చెందిన ప్రియాంక చోప్రా వంటి వారు ఇక్కడ వివాహం చేసుకున్నారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీలు కూడా రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇప్పుడు షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి కూడా అక్కడే జరుగుతోంది.

ALSO READ : తిరుపతి జూ పార్క్‌లో మరణించిన వ్యక్తి ఎవరు..? అసలు అతను సింహాల ఎన్‌క్లోజర్ లోకి ఎందుకు దూకాడు..?

Previous articleగుంటూరు కారం నక్కిలీసు గొలుసు సాంగ్ లో కనిపించిన ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? ఇలా కనిపించి అలా మాయం అయ్యాడు..!
Next articleశివకార్తికేయన్ పోషిస్తున్న ఈ “ముకుంద్ వరదరాజన్” ఎవరు..? ఈ వ్యక్తి గొప్పతనం ఏంటంటే..?