మనమే సెన్సార్ రిపోర్ట్..! సినిమా చూసి ఏం చెప్పారంటే..?

Ads

శర్వానంద్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా వస్తున్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. శర్వానంద్ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా కథ తెలిసిన కథ అయినా కూడా టేకింగ్ పరంగా బాగుంటుంది అని చెప్తున్నారు. సినిమా పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. సినిమాలో ఒక బాబు కూడా ఉంటాడు. కృతి శెట్టి ఆ బాబుకి తల్లి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

maname final talk

మరి సినిమా కథ ఏంటి అనే ఆసక్తి మాత్రం ట్రైలర్ చూస్తే ఇంకా పెరిగింది. ఈ సినిమాకి ఇటీవల సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాలో శర్వానంద్ పర్ఫార్మెన్స్ ని మెచ్చుకున్నారట. సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా చాలా బాగుంది అని, ఇందులో శర్వానంద్ చాలా బాగా నటించారు అని అంటున్నారట. శ్రీరామ్ ఆదిత్య గతంలో భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాసు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఈ మూడు సినిమాలు కూడా సెన్సిబుల్ గా ఉంటూనే ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది.

Ads

మనమే సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. శర్వానంద్ 2022 లో ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అమ్మ సెంటిమెంట్ తో నడిచే ఈ సినిమా చాలా మందిని కంటతడి పెట్టించింది. ఎమోషనల్ సీన్స్ అయితే ఇంకా బాగా చూపించారు అని చాలా మంది సినిమా చూశాక పొగిడారు. ఇందులో హీరో తల్లి పాత్రలో అమల నటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ్ లో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు శర్వానంద్ మళ్ళీ మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తర్వాత శర్వానంద్, సామజ వరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం అయితే శర్వానంద్ నటించిన మనమే సినిమా కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.

Previous articleఈ సీరియల్ మీలో ఎంత మందికి గుర్తుంది..? దీని పేరేంటో చెప్పగలరా..?
Next articleబుజ్జి అండ్ భైరవ..! ప్రభాస్ నటించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.