ఒకటి కంటే ఎక్కువ గణేష్ విగ్రహాలు ఉన్నాయా..? అయితే ఇలా మాత్రం అస్సలు చెయ్యకండి..!

Ads

ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టాలన్నా ఏ పూజ చేయాలన్నా మొదట మనం విఘ్నేశ్వరుడిని పూజించి ఎటువంటి విఘ్నాలు కలగకుండా చేపట్టిన కార్యం పూర్తి కావాలని వినాయకుడిని కోరుకుంటాము. అందుకనే పెళ్లి కానీ లేక పోతే ఏదైనా శుభకార్యాలు కానీ చేయాలంటే మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము. వినాయకుడు అందరికీ ప్రీతిపాత్రుడు. విఘ్నాలకి అధిపతి అయిన గణపతి కూడా భక్త సులభుడే. భక్తుల కోరికలని తీరుస్తాడు. మీ పూజ గదిలో కూడా వినాయకుడి విగ్రహం ఉందా..? నిజానికి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వినాయకుడి విగ్రహాలు చిత్రపటాలు ఉంటూ ఉంటాయి.

 

ముఖ్యంగా మనం రోజు పూజ చేసే చోటున కచ్చితంగా ఒక్క వినాయకుడు విగ్రహం అయినా ఉంటుంది ఇలా ఉంటే ఆయన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఒక్క గణపతి విగ్రహం కంటే ఎక్కువ ఉండకూడదు. ఇలా ఎక్కువ ఉంటే సిద్ధి, బుద్ధికి కోపం వస్తుందని పెద్దలు అంటారు. అందుకే పూజ మందిరంలో కేవలం ఒక్క వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే ఉంచుతారు. వినాయకుడి విగ్రహాలలో చాలా రకాలు ఉంటాయి. మరి ఎలాంటి విగ్రహం వలన ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం.

Ads

లడ్డూని పట్టుకొని ఉన్న గణేష్ విగ్రహం, కింద చిన్న ఎలుక ఉన్న విగ్రహాన్ని పూజిస్తే ఇంట్లో సంతోషం ఉంటుంది.
ఎరుపు రంగు వినాయకుడిని పూజిస్తే భక్తులు కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఎలాంటి కష్టం ఉన్నా సరే పోతుంది.
తెలుపు రంగు వినాయకుడి విగ్రహం ఇంట్లో ఉంచితే ఎంతో శుభం కలుగుతుంది. ఇంట్లో చికాకులు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి.

ఎక్కడైనా సరే వ్యక్తులు కూర్చునే ఎడమవైపు తొండం ఉన్న గణేష్ విగ్రహాన్ని పెడితే సకల విజయాలు లభిస్తాయి.
ఉద్యోగం చేసే చోట చిన్న గణేష్ విగ్రహాలని పెడితే ఒత్తిడి దూరం అవుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు.
స్వస్తిక్ గుర్తు ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఉత్తరదిక్కులో పెడితే దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా మీకు ఉండే సమస్యను బట్టి మీరు వినాయకుడి విగ్రహాన్ని పెట్టండి. అంతా శుభమే జరుగుతుంది.

Previous articleభార్య గర్భవతిగా ఉన్నప్పుడు.. భర్త ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 పనులు అస్సలు చేయకూడదు..!
Next articleశివుడికి అభిషేకం చేయడంలోని అంతరార్ధం ఏమిటో మీకు తెలుసా..? అభిషేకం చేసేటప్పుడు ఈ తప్పులు చెయ్యద్దు..!