విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?

Ads

ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా నిన్న విడుదల అయ్యింది. గోవర్ధన్ అనే ఒక వ్యక్తి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలా చూపించడానికి ప్రయత్నించారు. సినిమా పాటలు సినిమా విడుదలకి ముందే హిట్ అయ్యాయి. దాంతో సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.

minus points in family star trailer

సినిమా టీజర్ విడుదల అయిన తర్వాత ఇది సాధారణమైన కమర్షియల్ సినిమా అని కొంత మంది అన్నారు. ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఈ కామెంట్స్ మరింత ఎక్కువ అయ్యాయి. అయితే, కమర్షియల్ సినిమా అయినా పర్వాలేదు కానీ ఈ సినిమా టేకింగ్ బాగుంటే హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొన్ని విషయాల మీద కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి మైనస్ అయిన విషయాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

minus points in family star trailer

#1 ముందుగా, ఈ సినిమా డైరెక్టర్ పరశురామ్ పెట్ల, హీరో విజయ్ దేవరకొండ, కాంబినేషన్ లో అంతకుముందు గీతా గోవిందం సినిమా వచ్చింది. సైలెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా, చాలా పెద్ద హిట్ అయ్యింది. అందులో హీరోని చాలా పద్ధతి అయిన అబ్బాయిలాగా చూపించారు. ఆ టెంప్లేట్ ఉన్న సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు అదే టెంప్లేట్ మీద మళ్ళీ ఈ సినిమా వచ్చింది. ఒకసారి హిట్ అయితే దాన్ని ఫార్ములా అనుకొని, మళ్లీ అదే కాన్సెప్ట్ మీద సినిమా తీయడం అంటే కష్టమే. గీతా గోవిందం విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు అయ్యింది. ఈ గ్యాప్ లో ఆ సినిమాని చాలా మంది చూసేసారు. చాలా ఎక్కువ సార్లు చూశారు. కాబట్టి మళ్ళీ అదే టెంప్లేట్ లో సినిమా అంటే బోరింగ్ గా అనిపిస్తుంది. సీన్స్ కూడా రిపీట్ అయినట్టు అనిపిస్తాయి.

minus points in family star trailer

#2 హీరో మిడిల్ క్లాస్ అంటారు. పెట్రోల్ కూడా చాలా పొదుపుగా వాడతాడు. కానీ సొంతిల్లు ఉంటుంది. సొంతింట్లో పైన హీరోకి ఒక సపరేట్ రూమ్ ఉంటుంది. బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాడు. తర్వాత ఫారిన్ ట్రిప్ కూడా వెళ్తాడు. అప్పుడు హీరో మిడిల్ క్లాస్ అనే విషయం మర్చిపోతాడు. సినిమాలో హీరో మిడిల్ క్లాస్ అనేది కేవలం ఫస్ట్ హాఫ్ ముందుకి వెళ్లడానికి మాత్రమే ఒక పాయింట్ అంతే. ఆ తర్వాత సినిమా సబ్జెక్ట్ అంతా మారిపోతుంది. మిడిల్ క్లాస్ అంటే పేరుకి మాత్రమే కాదు, ఎమోషన్స్ అనే విషయాలు ఈ సినిమాలో చూపించలేదు.

family star review telugu

#3 కొన్ని సీన్స్ రాసుకున్న విధానం అయితే అసలు బాలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. హీరో అన్న ఒక తాగుబోతు. బాగా తాగుతూ ఉంటాడు. అందుకు ఒక కారణం చూపిస్తారు. అసలు ఆ కారణం అతను తాగడం అనే విషయానికి న్యాయం చేసేలాగా లేదు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప ఒక వ్యక్తి అలాంటి వ్యసనాలకు అలవాటు పడడు. కేవలం ఒకే ఒక్క మాట వల్ల వాళ్ళ అన్న అలా అయిపోయాడు అని చూపించడం అనేది కాస్త సిల్లీగా అనిపిస్తుంది.

minus points in family star trailer

ఇలాంటి లాజిక్ లేని సీన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అసలు హీరోయిన్ హీరో మీద థీసెస్ రాయడానికి ఎందుకు వస్తుందో, సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకడం ఏంటో,మళ్లీ తర్వాత హీరో చేరిన కంపెనీకి సీఈవో తనే అవ్వడం ఏంటో,  చివరిలో హీరో గురించి అందరి ముందు తాను చేసిన రీసెర్చ్ మొత్తం చెప్తే వాళ్ళంతా లేచి చప్పట్లు కొట్టడం ఏంటో, అక్కడ డైలాగ్స్ కూడా అర్థం అయ్యి అవ్వన్నట్టు ఉంటాయి.

Ads

minus points in family star trailer

#3 చిన్న చిన్న విషయాల మీద కూడా ఈ సినిమాలో కేర్ తీసుకోలేదు అనిపిస్తుంది. మొదటి సీన్ లో హీరో ఒక దోశ వేస్తాడు. అదేదో పేపర్ దోశ అన్నట్టు చూపిస్తారు. కేవలం మూడు చుక్కల పిండితో హీరో దోశ వేస్తాడు. దోశని గ్రాఫిక్స్ లో చూపించారు. నిజమే. ఇలాంటి గ్రాఫిక్స్ ఇప్పటి వరకు ఎక్కడ వాడలేదేమో. దోశని గ్రాఫిక్స్ చేయడం ఏంటో. ఫారిన్ వెళ్ళాక, హీరో లుంగీ కట్టుకొని వెళ్తే, అక్కడ ఫారిన్ వాళ్ళు హీరోని చూసి లుంగీ కట్టుకుంటారు. ఒకే ఆటో నుండి 9 మంది దిగుతారు. వాళ్లు సీరియస్ గా ఇవన్నీ చేస్తున్నా కూడా ఈ సీన్స్ చూసే వాళ్ళందరికీ మాత్రం కామెడీ అనిపిస్తాయి.

minus points in family star trailer

#4 సీనియర్ నటి రోహిణి హట్టంగడి, హీరోయిన్ లిప్ మూమెంట్స్ ఒకటి ఉంటే, డబ్బింగ్ వచ్చేది ఒకటి ఉంది. ఇది ఏదో ఒకటి, రెండు చోట్ల వస్తే బానే ఉంటుంది. సినిమా మొత్తం ఇలాగే చాలా చోట్ల జరిగింది. అసలు ఒక పాటలో అయితే హీరోయిన్ లిప్ మూమెంట్ కూడా ఇవ్వదు. కళ్యాణి వచ్చా వచ్చా అనేది డ్యూయెట్ సాంగ్. పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ పాట పాడుతూనే ఉంటాడు. కానీ ఫిమేల్ వాయిస్ వస్తున్నా కూడా హీరోయిన్ మాత్రం నోరు కూడా తెరవదు. ఇంకా చాలా చోట్ల ఇలాంటి డబ్బింగ్ ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా ఎమోషనల్ సీన్స్ లో హీరోయిన్ మాట్లాడుతుంటే తనకి తెలుగు వచ్చి రాక, అక్కడ ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయినట్టు అనిపిస్తాయి.

#5 విజయ్ దేవరకొండ మంచి నటుడు. అందులో సందేహం లేదు. అర్జున్ రెడ్డి లాంటి ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడంలో సందీప్ రెడ్డి పాత్ర ఎంత ఉందో, విజయ్ దేవరకొండ పాత్ర కూడా అంతే ఉంది. అసలు విజయ్ దేవరకొండ లేకపోతే అర్జున్ రెడ్డి అనే సినిమాని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ ఇటీవల మాత్రం విజయ్ దేవరకొండ సినిమాల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ పోషిస్తున్న పాత్రలు కనిపించట్లేదు. పెళ్లిచూపులు సినిమాలో ప్రశాంత్ కనిపించాడు.

hero who rejected sai pallavi for his movie

అర్జున్ రెడ్డి సినిమాలో అర్జున్ రెడ్డి అనే ఒక వ్యక్తి కనిపించాడు. గీతా గోవిందం సినిమాలో విజయ్ గోవిందం అనే ఒక సాధారణమైన మనిషి కనిపించాడు. కానీ తర్వాత నుండి ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ లాగానే నటిస్తున్నారు. డైలాగ్ డెలివరీ కూడా మారట్లేదు. పాత్రకి తగ్గట్టుగా గెటప్ మార్చుకోవడం మాత్రమే కాకుండా, బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడం, డైలాగ్ డెలివరీ కూడా మార్చుకోవడం వంటివి చేస్తే పాత్ర తెర మీద ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా గోవర్ధన్ అనే పాత్ర కనిపించలేదు. విజయ్ దేవరకొండ మాత్రమే కనిపించారు.

minus points in family star trailer

సినిమాలో పొరపాట్లు అనేవి చాలా సహజం. కానీ కొన్ని విషయాల గురించి మాత్రం చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఈ విషయాల గురించి కూడా అలాగే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.

ALSO READ : హీరో అన్న పదానికి అర్థమే మార్చేసిన గొప్ప నటుడు..! ఇతను ఎవరో తెలుసా..?

Previous articleహీరో అన్న పదానికి అర్థమే మార్చేసిన గొప్ప నటుడు..! ఇతను ఎవరో తెలుసా..?
Next articleMANJUMMEL BOYS REVIEW : మలయాళం సూపర్ హిట్ సినిమా తెలుగులో ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.