MANJUMMEL BOYS REVIEW : మలయాళం సూపర్ హిట్ సినిమా తెలుగులో ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

మలయాళంలో సూపర్ హిట్ అయ్యి, అత్యధిక కలెక్షన్స్ సాధించిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాని తెలుగులో కూడా విడుదల చేశారు. ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం : మంజుమ్మల్ బాయ్స్
  • నటీనటులు : సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, జీన్ పాల్ లాల్.
  • నిర్మాత : బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని
  • దర్శకత్వం : చిదంబరం
  • సంగీతం : సుశీన్ శ్యామ్
  • విడుదల తేదీ : ఏప్రిల్ 6, 2024

స్టోరీ :

కుట్ట‌న్‌ (షౌబిన్ షాహిర్‌), సుభాష్ (శ్రీనాథ్ భాసి), ఇంకా కొంత మంది మిత్రులు అందరూ కేరళలోని కొచ్చిలో ఉంటారు. వీళ్ళందరూ అక్కడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని మంజుమ్మల్ బాయ్స్ అని అంటారు. ఈ పేరుతో వీళ్ళకి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఒకసారి వీళ్లందరూ కలిసి కొడైకెనాల్ కి విహారయాత్రకి వెళ్లాలి అని అనుకుంటారు. వీళ్లలో సుభాష్ ట్రిప్ కి రాను అని చెప్తాడు. అయినా కూడా అతనిని ఒప్పించి ట్రిప్ కి తీసుకెళ్తారు. అక్కడ గుణ కేవ్ అనే ఒక గుహ ఉంటుంది.

అది చాలా లోతైన గుహ. అక్కడికి వెళ్లిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి బయటికి వచ్చిన దాఖలాలు ఉండవు. అక్కడికి వెళ్లడాన్ని నిషేధించినా కూడా, అటవీశాఖ అధికారుల కళ్ళు కప్పి వీళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడ ఉండే ఒక ఇరుకైన లోయలోకి సుభాష్ పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్ ని కాపాడారా? అక్కడ మంజుమ్మల్ బాయ్స్ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాళ్ళు ఏం చేశారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు అంటే ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఇది కూడా అలాంటి సినిమా. కొంత కాలం క్రితం నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. మలయాళంలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది. సర్వైవల్ అడ్వెంచర్ అనే జోనర్ లో ఈ సినిమా రూపొందించారు. సినిమాలో ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. సినిమాలో వాళ్ళు ఫీల్ అవుతున్న ఎమోషన్ ని, చూస్తున్న ప్రేక్షకుడు ఫీల్ అయితే సినిమా హిట్ అయినట్టే.

Ads

manjummel boys movie review

ఈ సినిమా విషయంలో జరిగింది అదే. వాళ్ళని చూస్తూ ఉంటే ప్రేక్షకులకు భయం వేస్తుంది. అతనిని ఎలా కాపాడతారు అనే ఆసక్తి ప్రేక్షకులలో కూడా ఉంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ అయితే కంటతడి పెట్టిస్తుంది. కానీ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ కి చాలా దూరంగా ఉంటుంది. సాధారణంగా మలయాళంలో వచ్చే చాలా సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్స్ కి దూరంగానే ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. కానీ కంటెంట్ బలంగా ఉంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు.

ఈ సినిమా విషయంలో అదే జరుగుతుంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా చాలా బాగా నటించారు. సంగీతం బాగుంది. దర్శకుడు చిదంబరం కథనాన్ని ఎంత ఉత్కంఠతో రాసుకున్నారు, అంతే ఉత్కంఠగా తెర మీద చూపించగలిగారు. షైజు ఖలీద్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి మరొక ప్రధాన బలం. కొన్ని సీన్స్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటాయి. కొన్ని చాలా స్లోగా సాగుతాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అక్కడక్కడ స్లోగా సాగే స్క్రీన్ ప్లే మీద ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ పాయింట్
  • సస్పెన్స్ ని చూపించిన విధానం
  • ఎమోషనల్ సీన్స్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • స్లోగా సాగే కొన్ని సీన్స్
  • కొన్ని చోట్ల సాగదీసినట్టుగా ఉన్న స్క్రీన్ ప్లే

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

సినిమాలో చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నా కూడా, వాటికంటే చాలా బలమైన కంటెంట్, అంతకంటే బలమైన టేకింగ్ ఈ సినిమాలో ఉంది. సర్వైవల్ అడ్వెంచర్ అనే కాన్సెప్ట్ మీద సౌత్ ఇండియాలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. దాంట్లో ఇంత బాగా తీసిన సినిమాలు ఇంకా తక్కువ. ఈ సంవత్సరం వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : మనవరాలిగా చేసిన “శ్రీదేవి” మీపక్కన హీరోయిన్ అనేసరికి “ఎన్టీఆర్” ఏమన్నారో తెలుసా.?

Previous articleవిజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమాలో… మైనస్ అయిన 5 విషయాలు ఇవేనా..?
Next articleప‌వ‌న్ కళ్యాణ్ భార్య “అన్నాలెజ్‌నోవా'” ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఆమె ఏం చేస్తూ ఉండేవారు అంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.