పూజకి ఉపయోగించే పూలల్లోనూ కొన్ని పద్ధతులు వున్నాయి..ఈ తప్పులని మాత్రం అస్సలు చెయ్యద్దు..!

Ads

హిందువులు ఇంచుమించుగా ప్రతి రోజు పూజ చేస్తూ ఉంటారు. రోజూ అష్టోత్తరాలతో కాకపోయినా పూజా విధానం చదువుకుని పూలతో పూజ చేసి నైవేద్యం పెడతారు. నిజానికి చాలామంది పూజ చేసే విధానంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పూల విషయంలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. దేవుడికి పూలు పెట్టే విధానం కూడా ఉంది. మరి దేవుడికి పూల తో పూజ చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చూసి ఎప్పుడూ ఇలాంటి తప్పులని చేయకండి.

దేవుడికి పూజ చేసేటప్పుడు సొంతంగా మనం ఒక పూల మొక్కని నాటి ఆ పూలను దేవుడికి పెడితే రెండు పుణ్యాలూ వస్తాయి.

ఒక పక్క పూజ చేసినందుకు మరొక పక్క పూల మొక్కను పెంచుతున్నందుకు పువ్వులని సొంతంగా మనం నాటి పెంచి ఆ పూలని దేవుడికి పెడితే అది ప్రధమ పూజ. ఇంకొకరి ఇంట్లో నుండి తెచ్చి పూలను పెడితే అది మధ్యమ పూజ. కొనుక్కున్న పూల తో పూజ చేస్తే అది అధమ పూజ. ఇలా పూజల్లో మూడు రకాలు ఉన్నాయి. అయితే ఇది వరకు చూస్తే పెద్ద పెద్ద ఇళ్ళూ పూల మొక్కలని పెంచుకోవడానికి స్థలం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్లలోనే ఉంటున్నారు.

Ads

మొక్కల్ని పెంచడానికి చోటు కూడా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పూజ చేస్తే ఫలితం ఉంటుంది అబ్బా అని చూస్తున్నారా..? దానికి సమాధానం కూడా ఇప్పుడు చూసేద్దాం. వీలైనంత వరకూ మనం మన ఇంట్లో నాటిన మొక్క పూలని పూజకి ఉపయోగించడం మంచిది. అంతేకానీ ఇరుగుపొరుగు వారిని అడగడం లేదంటే వారికి తెలియకుండా కోయడం వంటివి చేయకూడదు.

ఒకవేళ మీ ఇంట్లో మీరు మొక్కని పెంచుకోలేకపోతుంటే అప్పుడు కొనుక్కున్న పూలతో పూజ చేయడం మంచిది. పూజ చేసిన తర్వాత ఆ నిర్మాలని ఎవరూ తొక్కకూడదు. కాబట్టి త్వరగా ముడుచుకుపోయేవి. మట్టిలో కలిసిపోయేవి ఉపయోగించండి. ఉదాహరణకి నందివర్ధనాలు, గన్నేరు పూలు, మందార పూలు త్వరగా ముడుచుకుపోయి మట్టి లో కలిసిపోతాయి. అటువంటి వాటితో పూజ చేసుకోవడం మంచిది.

Previous articleఉపాసన చెప్పిన బౌండరీస్ అంటే ఏంటి..? భార్యాభర్తలు ఇవి ఎందుకు ఫాలో అవ్వాలి..?
Next articleఛీఛీ… ఫ్యామిలీ అంతా కలిసి చూసే టీవీ షోలో ఇలా చేయడం ఏంటి..? ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు..?