5 కోట్లు పెట్టి తీసిన సినిమా… 78 కోట్లు వసూలు చేసింది..! ఈ సినిమా చూశారా..?

Ads

కొన్ని సార్లు సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి. సినిమా తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా దానికంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ వస్తాయి. ఈ సినిమా కూడా అలాగే ఐదు కోట్లు పెట్టి తీశారు. ఎటువంటి అంచనాలు లేకుండా 2022 లో  సినిమా విడుదల అయ్యింది. కట్ చేస్తే ఆ సంవత్సరం ఇండస్ట్రీలోనే చాలా పెద్ద హిట్ అవ్వడంతో పాటు, 78 కోట్లు కూడా సంపాదించింది. ఈ సినిమా పేరు హృదయం. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.

movie that collected 78 crores

వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకత్వం వహించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అరుణ్ నీలకందన్ (ప్రణవ్ మోహన్ లాల్) కాలేజ్ లో దర్శన (దర్శన రాజేంద్రన్) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత వాళ్లిద్దరూ విడిపోతారు. కొంత కాలం తర్వాత అరుణ్ మళ్లీ నిత్య (కళ్యాణి ప్రియదర్శన్) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. మధ్యలో కొంత కాలం చాలా రకమైన సమస్యలు ఎదుర్కొంటాడు. అవన్నీ ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. సినిమా అంతా కూడా అరుణ్ అనే ఒక వ్యక్తి జీవితం ఆధారంగానే సాగుతుంది.

Ads

కాలేజ్ స్టూడెంట్స్ కి సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అందులోనూ ముఖ్యంగా హాస్టల్ లో ఉన్న వాళ్ళకి అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే హాస్టల్ లో జరిగే విషయాలన్నిటిని కూడా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళం భాషలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ రైట్స్ ధర్మ ప్రొడక్షన్స్ తీసుకున్నారు అని సమాచారం. మరి ఈ సినిమా ఈ భాషలో ఎప్పుడు రీమేక్ అవుతుంది అనేది తెలియదు. కానీ మలయాళం హృదయం సినిమాకి తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సినిమా పాటలు భారతదేశం మొత్తం చాలా ఫేమస్ అయ్యాయి. సినిమాలో నటించిన వాళ్లందరికీ కూడా చాలా మంది అభిమానులు అయ్యారు.

Previous articleఅల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్న ఈ వైసీపీ అభ్యర్థి ఎవరు..? అల్లు అర్జున్ కి ఏమవుతారంటే..?
Next articleసమాజంలో ఆడవాళ్లు మాత్రమే ఎదుర్కొనే 5 సమస్యలు..! వీటి నుండి విముక్తి దొరకదా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.