Ads
50 దశాబ్దాల క్రితం ఎన్నో చిత్రాలకు హీరోగా నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు చంద్రమోహన్. 1966 రంగులరాట్నం చిత్రంతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు చంద్రమోహన్. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
1975 లో విడుదలైన అన్నదమ్ముల అనుబంధం చిత్రం అప్పటిలో ఎంతో ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని నందమూరి తారక రామారావు, మురళీమోహన్, బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి L.D లాల్ దర్శకత్వం వహించగా, చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించారు.
అన్న తమ్ముడు కలయికకు గుర్తుగా అలనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే.. అనే పాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ గారు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
మొదటిగా ఈ చిత్రంలోని బాలకృష్ణ పాత్ర కోసం చంద్రమోహన్ గారిని నిర్ణయించారట. ఈ పాటకు సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. నేను 15 రోజుల పాటు ఈ పాటకు రిహార్సల్స్ చేసి, సమయం వచ్చిన తర్వాత మేకప్ రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాను. ఎంతసేపటికీ ఎవరు నాకు మేకప్ వేయడానికి రాలేదు. అలాగే కొన్ని గంటల పాటు వెయిట్ చేస్తూనే రూమ్ లో ఉన్నాను. ఉన్నట్టుండి పాట వినిపించడంతో రిహార్సల్స్ జరుగుతుందేమో అనుకుని మేకప్ రూమ్ లోనే కూర్చుని ఉన్నాను. ఈ చిత్ర నిర్మాత పీతాంబరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయన ఎంతసేపటికి రాకపోవడంతో ఆయన కోసం నేనే వెళ్ళిచూశాను.
Ads
సెట్స్ లో నా కాస్టమ్స్ లో మరొకరు నా పాత్రలో నటిస్తున్నారు. అక్కడున్న వారు అతను ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అని చెప్పగా అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోయాను. నిర్మాత పీతాంబరం వచ్చి ఒక చిన్న పొరపాటు జరిగింది, సాయంత్రం వచ్చి నేను మాట్లాడతాను ఇంటికి వెళ్ళండి అని చేతులు పట్టుకొని బ్రతిమిలాడాడు.
అంత పెద్దాయన చెప్పేసరికి నేను ఇంటికి అవమానంతో చేరుకున్నాను. ఆ తర్వాత పీతాంబరం గారు వచ్చి నాకు జరిగిన విషయం అంతా వివరించారు. చివరి క్షణం లో ఎన్టీఆర్ గారు మీ పాత్రలో బాలకృష్ణ చేయాలని నిర్ణయించుకున్నారు అని చెప్పుకొచ్చారు. ఒక విధంగా ఈ సంఘటన కూడా నాకు కలిసొచ్చింది.
ఈ అన్నదమ్ముల అనుబంధం చిత్రం తమిళంలో ఎంజీఆర్ గారు చేశారు. అందులో ఆయన తమ్ముడిగా నేను నటించాను. ఎంజీఆర్ ను కలుసుకుని జరిగిన విషయమంతా ఆయనతో వివరించాను. ఆయన నన్ను ప్రోత్సహించి ఆ చిత్రంలో నాకు తమ్ముడు పాత్రకి అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. అంటూ తన ఎదుర్కొన్న సంఘటనను గురించి ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు చంద్రమోహన్.