9 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమాకి… ఇప్పుడు సీక్వెల్..! ఈ సినిమా చూశారా..?

Ads

కొన్ని సినిమాలకి ప్రమోషన్స్ అవసరం ఉంటుంది. కొన్ని సినిమాలకి అందులో నటుల వల్ల ప్రమోషన్స్ లేకుండానే ఆ సినిమాకి ప్రమోషన్ అయిపోతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా, అసలు ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ అవుతాయి.

ఇలాంటి క్యాటగిరీకి చెందిన సినిమాలు చాలానే వచ్చాయి. ఎన్నో వస్తూనే ఉంటాయి కూడా. అయితే 2015 లో సైలెంట్ గా ఇలాగే ఒక సినిమా వచ్చి హిట్ అయ్యింది.

movie which is releasing its sequel after 9 years

కంటెంట్ ఉంటే అందులో ఉన్న నటులు తెలిసిన వాళ్ళా? తెలియని వాళ్ళా? అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు అనే పాయింట్ ని ఈ సినిమా మరొక సారి ప్రూవ్ చేసింది. ఆ సినిమానే డిమోంటి కాలనీ. తమిళ్ లో రూపొందిన ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. సైలెంట్ గా తెలుగులో కూడా హిట్ అయ్యింది. ఈ సినిమాకి అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.

movie which is releasing its sequel after 9 years

ఈ సినిమాలో అరుళ్ నిధి, రమేష్ తిలక్, సనంత్, అభిషేక్, జోసెఫ్ జార్జ్ ముఖ్య పాత్రల్లో నటించారు. నిజంగా ఉన్న డిమాంటి కాలనీ తోనే ఈ సినిమా రూపొందింది. ఒక ఐదుగురు స్నేహితులు డిమోంటి కాలనీలో ఉన్న ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న పరిణామాలతోనే ఈ సినిమా కథ రూపొందింది. సినిమా అంతా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Ads

movie which is releasing its sequel after 9 years

అలా ఉంటుంది అని ఆలోచన కూడా ఎవరికి రాదు. దాంతో ఈ సినిమా అప్పుడు చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు, అంటే 9 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది. డిమోంటి కాలనీ 2 పేరుతో ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. ఈ ట్రైలర్ తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాకి అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.

movie which is releasing its sequel after 9 years

ఇందులో హీరో అరుళ్ నిధి నటిస్తున్నారు. హీరోయిన్ ప్రియ భవాని శంకర్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో పాటు, హారర్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే మొదటి భాగం చాలా అంచనాలని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఆ అంచనాలని అందుకుంటుందా లేదా తెలియాలి అంటే ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.

watch trailer :

ALSO READ : “ఇంత హైప్ ఎందుకు ఇచ్చారో అర్థం అవ్వట్లేదు… ఫుడ్ అస్సలు బాలేదు..!” అంటూ… “కుమారి ఆంటీ”పై నటి కీర్తి భట్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?

Previous articleఅప్పట్లో షారుఖ్ ఖాన్, మహేష్ బాబు వంటి స్టార్లు ప్రమోట్ చేసిన “బైజూస్” పరిస్థితి ఇప్పుడు ఇలా తయారయ్యింది ఏంటి..? ఏం జరిగిందంటే..?
Next articleఅనుష్క శర్మ – విరాట్ కోహ్లీ కొడుకు పేరుకి ఇంత అర్థం ఉందా..? 2 భాషల్లో 2 రకాలుగా..?