“ఖుషి” లాగానే టైటిల్ ని రిపీట్ చేసిన 15 సినిమాలు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!

Ads

ఏదైనా మంచి టైటిల్ ఉంటే మళ్ళీ అదే టైటిల్ తో సినిమాలని రిపీట్ చేస్తూ ఉంటారు ఇదివరకు వచ్చిన టైటిల్స్ క్యాచీగా ఉండడంతో మళ్ళీ వేరే స్టోరీ కి ఆ క్యాచీ టైటిల్స్ ని ఉపయోగించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాతో పాటుగా చాలా సినిమాలు టైటిల్స్ రిపీట్ అయ్యాయి మరి వాటి గురించి ఇప్పుడు చూద్దాం..

మాస్టర్:

మాస్టర్ అనే టైటిల్ తో ఇదివరకుఒక మూవీ వచ్చింది. అదేనండీ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమా. ఈ మూవీ మీకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు మళ్లీ మాస్టర్ సినిమాని విజయ్ హీరోగా పెట్టి తీసుకొచ్చారు.

శ్రీరస్తు శుభమస్తు:

చిరంజీవి హీరోగా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమా మీకు గుర్తుండే ఉంటుంది అయితే మళ్లీ అదే టైటిల్ ని అల్లు శిరీష్ సినిమాలో కూడా పెట్టారు. శిరీష్ శ్రీరస్తు శుభమస్తు తో మంచి హిట్ ని అందుకున్నాడు.

ఆడవాళ్లు మీకు జోహార్లు:

ఈ సినిమా టైటిల్ తో ఇదివరకు ఒక సినిమా వచ్చింది. అయితే ఆడవాళ్లు మీకు జోహార్లు టైటిల్ తో శర్వానంద్ రష్మిక కాంబినేషన్ లో సినిమా వచ్చిన విషయం తెలిసిందే కానీ ఇదివరకు కృష్ణంరాజు చిరంజీవి హీరోలుగా కే బాలచందర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.

బ్రో:

అవికా గోర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన బ్రో సినిమా కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఇదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ సినిమా రాబోతోంది.

సర్దార్:

కార్తీ హీరోగా వచ్చిన సర్దార్ సినిమా అందరికీ తెలుసు. కానీ 80 లలో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా సర్దార్ సినిమా వచ్చింది.

మహర్షి:

మహర్షి సినిమా కూడా ఇదివరకే వచ్చింది మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి కాకుండా వంశీ దర్శకత్వంలో 90 లలో మహర్షి సినిమా వచ్చింది ఇదివరకు వచ్చిన మహర్షి మ్యూజికల్ గా పెద్ద హిట్ అయింది.

గాడ్ ఫాదర్:

చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు అయితే ఇదివరకు ఏఎన్ఆర్ వినోద్ కుమార్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో సినిమా వచ్చింది. ఈ టైటిల్ కూడా రిపీట్ అయింది.

విక్రమ్:

Ads

నాగార్జున హీరోగా విక్రమ్ సినిమా మొదట వచ్చింది అయితే ఇదే టైటిల్ తో కమల్ హాసన్ హీరోగా మొన్నామధ్య విక్రమ్ సినిమాని తీసుకువచ్చారు ఈ సినిమా టైటిల్ కూడా రిపీట్ అయింది.

వారసుడు:

వారసుడు సినిమా ఇది వరకే వచ్చింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నాగార్జున హీరోలుగా ఈ సినిమా లో నటించారు. వారసుడు మంచి హిట్ అయింది. అయితే టాలీవుడ్ హీరో విజయ్ కూడా వారసుడు సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చాడు ఈ వారసుడు కూడా ప్రేక్షకులకు నచ్చింది.

స్వాతిముత్యం:

అప్పట్లో కళాతపస్వి కె విశ్వనాథ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా స్వాతిముత్యం సినిమా వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. అమాయకుడి పాత్ర లో కమల్ హాసన్ జీవించేశారు. బెల్లంకొండ సురేష్ బాబు తనయుడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా స్వాతిముత్యం తీశారు. ఇలా ఈ సినిమా టైటిల్ కూడా రిపీట్ అయింది.

శ్రీమంతుడు:

మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమా వచ్చింది అయితే ఇది వరకే అక్కినేని నాగేశ్వరావు కూడా శ్రీమంతుడు అనే సినిమా చేశారు. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా పెద్ద హిట్టే అయింది.

బంగారు బుల్లోడు:

బాలకృష్ణ బంగారు బుల్లోడు సినిమా చేశారు అయితే అల్లరి నరేష్ కూడా అదే టైటిల్ తో బంగారు బుల్లోడు సినిమా చేశాడు. కానీ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.

సుల్తాన్:

బాలకృష్ణ హీరోగా ఇదివరకు సుల్తాన్ అనే సినిమా వచ్చింది అయితే కార్తీ హీరోగా సుల్తాన్ అనే సినిమా వచ్చింది. ఇలా ఈ టైటిల్ కూడా రిపీట్ అయింది.

తొలిప్రేమ:

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా అందరికీ గుర్తుండిపోయే ఉంటుంది ఈ సినిమాని కరుణాకరన్ దర్శకత్వం వహించారు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది ఈ మూవీ. వరుణ్ తేజ్ కూడా తొలిప్రేమ టైటిల్ తో సినిమా చేశాడు. మంచి హిట్ ని అందుకున్నాడు కూడా.

ఖుషి:

పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషి సినిమా ఇది వరకు వచ్చింది అయితే తర్వాత ఇప్పుడు మళ్లీ విజయ్ దేవరకొండ సమంత కాంబినేషన్లో ఖుషి సినిమా రాబోతోంది.

Previous article“జైలర్”లో తమన్నా బాయ్ ఫ్రెండ్ ఆ డైరెక్టర్ కొడుకని తెలుసా.? అతని బ్రదర్ కూడా హీరోనే.!
Next article“మెహర్ రమేష్” తో పాటు… టాప్ హీరోలతో సినిమాలు చేసినా కూడా సక్సెస్ అవ్వలేకపోయిన 5 డైరెక్టర్స్..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.