“జైలర్”లో తమన్నా బాయ్ ఫ్రెండ్ ఆ డైరెక్టర్ కొడుకని తెలుసా.? అతని బ్రదర్ కూడా హీరోనే.!

Ads

జైలర్ మూవీలో ప్రతి అంశం ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది తమన్నా మరియు సునీల్ మధ్య జరిగే లవ్ ట్రయాంగిల్ సీన్స్. ఎంతో ఫన్నీగా సాగే ఈ సీన్స్ లో తమన్నా లవర్ గా నటించిన బాలు గుర్తున్నాడా? అతని అసలు పేరు సునీల్ రెడ్డి. అతని పేరు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ అతని తండ్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ కోదండరామరెడ్డి కొడుకే ఈ సునీల్ రెడ్డి.సునీల్ రెడ్డి సోదరుడి పేరు వైభవ్ రెడ్డి. టాలీవుడ్ లో వైభవరెడ్డి కూడా మంచి లీడ్ యాక్టర్ గా నటించారు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ వహించిన గొడవ చిత్రంతో వైభవ్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత సరోజా, గోవా ,గ్యాంబ్లర్ వంటి సినిమాలలో కూడా నటించి బాగా పాపులర్ అయ్యారు. తెలుగు ఇండస్ట్రీ కంటే కూడా వైభవ్ రెడ్డి తమిళ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.

Ads

ఆగస్ట్ 10 వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయినా జైలర్ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, మర్నామీనన్, వసంత్ రవి, విజయకన్, వీటీవీ గణేష్, యోగి బాబు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్,జాకీ శ్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ కి రజనీకాంత్ ఒక ప్లస్ పాయింట్ అయితే..అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం మరోక ప్లస్ పాయింట్.

Previous articleమన ఇండస్ట్రీలో బంధుత్వం ఉన్న ఈ సెలబ్రిటీలు ఎవరో తెలుసా..? రాజమౌళికి ఆ ప్రొడ్యూసర్ బావ అవుతారా..?
Next article“ఖుషి” లాగానే టైటిల్ ని రిపీట్ చేసిన 15 సినిమాలు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!