Ads
కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా…ఈ సినిమా వాళ్లకు ఏ కాన్సెప్ట్ అయినా సినిమా తీయడానికి సెట్ అయిపోతుంది. వెరైటీగా ఉంది జనాలు చూస్తారు అనుకుంటే చాలు అది ఎలాంటి కాన్సెప్ట్ అయినా ధైర్యంగా సినిమా తీసేస్తున్నారు…జనాల మీదకు వదిలేస్తున్నారు. ఇలా వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన వెరైటీ చిత్రమే ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.
బిగ్ బాస్ షో పుణ్యమా అని ప్రేక్షకులకు బాగా దగ్గరైన సోహైల్ ఈ చిత్రం లో హీరోగా నటించాడు. ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు వింజనంపాటి శ్రీనివాస్ వహించారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అనే వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఒక ఎమోషనల్ రోలాకోస్టర్ లాగా ఉంటుంది. ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మాంచి రెస్పాన్స్ అందుకుంది.
Ads
అయితే త్వరలో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఒక టాటూ ఆర్టిస్టు అయిన గౌతమ్ (సోహెల్)..మహి (రూప) అనే అమ్మయిని ప్రేమించి ,తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటాడు. అయితే తన భార్య ప్రెగ్నెంట్ అయినప్పుడు తాను ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో ఆమె గర్భాన్ని తాను తీసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ నేపథ్యంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఫైనల్గా అతని జీవితం ఏమవుతుంది అనేది సినిమాలో చూడాల్సిందే.
ఈ సినిమాని కొందరు అభినందిస్తుంటే ..మరి కొందరు ఇలాంటి కాన్సెప్ట్ ని కూడా వదలరా అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ ఒకసారి చూడదగిన మంచి ఎమోషనల్ ఓరియెంటెడ్ చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్.