“అరియానా” విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది..? అప్పుడేమో అలా అన్నారు.. ఇప్పుడు ఇలా..?

Ads

బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన నటి అరియానా గ్లోరీ. అరియానా ఇంతకముందు చాలా ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా చేశారు. కానీ బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటించడంతో పాటు చాలా ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ కూడా చేస్తున్నారు.

అయితే అరియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి, అలాగే తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తారు. అరియానా మీద గత కొద్ది రోజుల నుండి కామెంట్స్ వస్తున్నాయి.

కారణం ఏంటి అనేది తెలియదు కానీ అరియానా ముందుకంటే చాలా మారిపోయారు. అంతకముందు సన్నగా ఉన్న అరియానా సడెన్ గా కాస్త బొద్దుగా అయ్యారు. దాంతో, ఇటీవల అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ కి, “సన్నగా ఉండేవాళ్ళు కదా..? ఇలా లావుగా అయిపోయారు ఏంటి..?” అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు, ఇద్దరు అంటే వదిలేస్తారు. కానీ ఈ కామెంట్స్ మరీ ఎక్కువ అయిపోయాయి. కొంత మంది అయితే అరియానాని ట్రోల్ కూడా చేస్తున్నారు.

Ads

దాంతో అరియానా ఈ విషయం మీద స్పందించారు. ఇది మొదటి సారి కాదు. అరియానా ఎప్పుడు సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్ట్ చేసినా కూడా ఏదో ఒక రకంగా కామెంట్స్ వస్తాయి. అయినా ప్రతిసారి అరియానాకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? అంతకముందు సన్నగా ఉన్నపుడు, “ఏంటి ఇంత సన్నగా ఉన్నావు?” అని అనేవాళ్ళు. ఇప్పుడు కాస్త లావుగా అవ్వగానే, “ఇంత లావుగా అయిపోయావు ఏంటి?” అని అంటున్నారు. అరియానా ఈ విషయం మీద చాలా సార్లు మాట్లాడారు కూడా.

ariyana glory post on negative comments

ఇటీవల కూడా ఈ కామెంట్స్ మీద అరియానా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, “నేను ఎలా ఉంటే మీకెందుకు?” అని అన్నారు. నిజమే కదా? తను ఎలా ఉంటే మనకి ఎందుకు. తన కష్టం మీద తన పైకి వచ్చారు. ఇప్పుడు కూడా కష్టపడితేనే ఇంత గుర్తింపు సంపాదించుకున్నారు. తన కష్టాన్ని గుర్తించకుండా, లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు అని కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు కదా? ఒక సారి, రెండు సార్లు అంటే వాళ్లు కూడా లైట్ తీసుకుంటారు. కానీ ప్రతిసారి ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటే వాళ్ళకి మాత్రం చిరాకుగా ఉండదా? లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా గుర్తించాల్సింది వారు వృత్తిలో చేస్తున్న కష్టాన్ని కానీ ఇలాంటి మార్పులని కాదు. అయినా మారాల్సింది ఇలా కామెంట్స్ చేసే వారి మైండ్ సెట్ ఏమో.

Previous articleస్కంద సినిమాలో “రామ్ పోతినేని” స్థానంలో మొదటిగా అనుకున్న హీరో ఎవరో తెలుసా..? ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే..?
Next articleఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా తీస్తారా…? ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడంటే?