ఎం ఎస్ నారాయణ కొడుకు ఇంత అవమానాన్ని ఎదుర్కొన్నారా..? అవకాశం కోసం అడిగితే…!

Ads

ఎం ఎస్ నారాయణ గురించి మనం కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎం ఎస్ నారాయణ అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా ఎం ఎస్ నారాయణ పేరు పొందారు. నిజానికి చాలా మంది ఇండస్ట్రీ లోకి వస్తారు కానీ అందరూ గుర్తింపుని తెచ్చుకోలేరు. కానీ మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో ఎం ఎస్ నారాయణ కూడా అగ్ర స్థానం లో ఉంటారు. చాలా సినిమాల్లో నటించి అందరినీ నవ్వించారు నారాయణ.

నిజానికి ఇప్పుడు కూడా ఆయన చేసిన కామెడీ వీడియోలు చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఎం ఎస్ నారాయణ కి క్రేజ్ కూడా ఎక్కువే.

అయితే సాధారణంగా ఎవరైనా సినిమాలో నటిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు లేదంటే కొడుకు, కూతురు ఇలా ఎవరైనా కూడా ఇండస్ట్రీలోకి వచ్చేస్తూ ఉంటారు. చూసేవాళ్ళకి ఇది చాలా ఈజీ అని అనుకుంటారు ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే ఈజీగా మనం కూడా ఇండస్ట్రీలోకి వెళ్లిపోవచ్చు అవకాశాలు వచ్చేస్తాయి అని భావిస్తారు. కానీ అది నిజం కాదని ఎం ఎస్ నారాయణ కొడుకుని చూస్తే తెలుస్తుంది. వారసుడిగా ఎం ఎస్ నారాయణ కొడుకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తనే విక్రమ్, విక్రమ్ సినిమాల్లోకి వచ్చాడు కానీ ప్రస్తుతం సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం విక్రమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు.

Ads

అలానే హైకోర్టు లాయర్ గా కూడా పని చేస్తున్నాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత విక్రమ్ చిన్న చిన్న పాత్రలు చేసాడు. కేవలం హీరో గానే చేయాలని ఏమీ లేదు చిన్న చిన్న పాత్రలు చేయడానికి కూడా ఆసక్తి చూపించాడు. తను మొదటి సినిమాకి ఎం ఎస్ నారాయణ దర్శకత్వం వహించారు ఇతర దర్శకులు దగ్గరికి అవకాశం కోసం వెళితే కమెడియన్ కొడుకులను రిసీవ్ చేసుకోరు అని కామెంట్లు చేశారు అని ఎం ఎస్ నారాయణ కొడుకు చెప్పారు. పైగా బ్యాక్గ్రౌండ్ ఉంటే సినిమాల్లో అవకాశం వచ్చేస్తుందని అంతా భావిస్తారు. కానీ అది నిజం కాదని విక్రమ్ చెప్పారు.

Previous article”జల్సా” సినిమా క్రియేట్ చేసిన రికార్డు ఏమిటో తెలుసా..?
Next articleటాలీవుడ్‌ లో ఎక్కువ రెమ్యున‌రేషన్ తీసుకుంటున్న ద‌ర్శ‌కులు వీళ్ళే..!