Ads
మహిళలు పిల్లలని కన్నేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చాలా మంది మహిళలు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఒక బిడ్డని కన్నాక మరో బిడ్డకి జన్మనివ్వడానికి కచ్చితంగా కాస్త గ్యాప్ ని పాటించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చాలా మంది మహిళలకి ఉండే సందేహం ఏంటంటే.. ఒక కాన్పుకి రెండవ కాన్పుకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అని.. నిజానికి మహిళలు కచ్చితంగా దీనిని తెలుసుకు తీరాలి.
ఒక కాన్పుకి రెండవ కాన్పుకి మధ్య కరెక్ట్ గ్యాప్ ని మెయింటైన్ చేయకపోతే కచ్చితంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా బిడ్డనివ్వడం అంత సులభం కాదు.
తొమ్మిది నెలలు కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఆడవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. శారీరికంగా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలానే మానసికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. రక్తహీనత, వికారం, వాంతులు, నీరసం ఇలా చాలా రకాల సమస్యలను గర్భిణీలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకవేళ కనుక సరైన గ్యాప్ ని పాటించకపోతే మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బిడ్డకి మరొక బిడ్డకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి..? ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత మరొక బిడ్డ ని కనడానికి ఎంత గ్యాప్ ని ఇవ్వాలి అనే విషయానికి వస్తే… ఒక బిడ్డకి మరొక బిడ్డకి మధ్య రెండు నుండి మూడేళ్ల గ్యాప్ ఉంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
Ads
ఇలా గ్యాప్ ఇవ్వడం వలన శారీరకంగా ఎటువంటి మార్పులు అయితే ప్రెగ్నెన్సీలో వచ్చాయో అవన్నీ కూడా ఈ గ్యాప్ లో తొలగిపోయే తిరిగి నార్మల్ స్టేజ్ కి వస్తారు. అలానే ప్రెగ్నెన్సీ టైంలో రక్తాన్ని కోల్పోతూ ఉంటారు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు అర లీటర్ రక్తాన్ని కోల్పోతారు. సి సెక్షన్ అయితే లీటర్ రక్తాన్ని కోల్పోతూ ఉంటారు. గ్యాప్ తీసుకోవడం వలన ఈ రక్తాన్ని మళ్లీ మీరు తిరిగి పొందుతారు. ఒకవేళ కనుక గ్యాప్ తీసుకో లేదంటే రక్తహీనత సమస్య వస్తుంది. ఈ గ్యాప్ లో మంచి డైట్ తీసుకోవడం వంటివి అనుసరిస్తూ ఉండాలి. ఎన్ని టిప్స్ పాటించినా తిరిగి మళ్లీ కోలుకోవడానికి రెండేళ్లు పడుతుంది సో కచ్చితంగా మూడు ఏళ్ల పాటు గ్యాప్ ఇస్తే మంచిది.