ఎన్టీ రామారావుకి యాడ్‌లో నటించడానికి ఎంత పారితోషికం ఇచ్చారో తెలుసా..!

Ads

నటరత్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన పేరు తెలుగు చరిత్ర ఉన్నన్ని రోజులు చెప్పుకుంటారు. తెలుగు వారి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసిన హీరో మరియు తిరుగులేని నాయకుడు. తెలుగు ప్రజలకు రాముడు మరియు కృష్ణుడు ఆయనే. ఎన్టీ రామారావు జానపద, పౌరాణిక, చారిత్రాత్మక సినిమాలలో జీవించి ఆడియెన్స్ హృదయాలలో చెరిగిపోలేని ముద్రను వేశారు.

Ads

ఆయన నటించిన సినిమాలు, క్యారెక్టర్లు, సృష్టించిన చరిత్ర ఎప్పటికీ అద్భుతం. అజరామరం అని చెప్పవచ్చు. ఎన్టీ రామారావు 1923లో మే 28న నిమ్మకూరుఅనే గ్రామంలో జన్మించారు. ఇది ఆ మహనుభావుడి శత జయంతి ఏడాది. ఈ క్రమంలో ఎన్టీ రామారావు గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ ఆసక్తికర విషయాలలో ఎన్టీ రామారావు అప్పట్లోనే ఒక యాడ్ లో నటించారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎక్కువ మందికి తెలియదు. ఆ ప్రకటనలో నటించినందుకు గానూ ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారంట. ఆ వివరాల గురించి ఇప్పుడు చూద్దాం..
ఎన్టీఆర్ చేసిన ఈ యాడ్ విజయా కెమికల్స్ యొక్క అశోకా ఆమ్లా బ్రిలియంటైన్ కి చెందింది. ఆ యాడ్ కి చెందిన న్యూస్ పేపర్ కటింగ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అది ఏమిటన్నది స్పష్టంగా తెలియట్లేదు. కానీ ఈ యాడ్ హెయిర్ స్ప్రే లేదా హెయిర్ ఆయిల్ కావచ్చని అనిపిస్తోంది. ఆ ప్రకటనలో అశోకా ఆమ్లాలో ఉన్నటువంటి ఔషదాలు మెదడుకి మరియు కళ్లకి చల్లదనం ఇస్తుంది. అలాగే రోజంతా సువాసనను ఇస్తుందని,ఇది పురుషులకు మరియు స్త్రీలకు మంచి శిరోజాలంకరణ సాధనము అని రాసి ఉంది.
ఇక ఈ బ్రాండ్‌ని ఎన్టీఆర్ ప్రమోట్ చేసినందుకు లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారంట. ఇది అప్పట్లో చాలా ఎక్కువ. ఇక ఎన్టీ రామారావు యాడ్స్ లో నటించలేదు. అందుకే బాలకృష్ణ కూడా యాడ్స్ లో నటించడు అని ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఒక టాక్ ఉండేది. కానీ ప్రస్తుతం టాక్ షోతో అందరికి షాకిచ్చిన బాలకృష్ణ, యాడ్స్‌కి కూడా ఒప్పుకుని అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. ఇటీవలే రియల్ ఎస్టేట్ ప్రకటనలో నటించి అలరించారు.అంతే కాకుండా వేగ జువెలర్స్ ప్రకటన కూడా పూర్తి చేశాడు.
Also Read: ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు పరమ శివుడిగా మెప్పించిన 15 మంది తెలుగు నటులు వీరే..

Previous articleహీరోయిన్ మీనా త‌ల్లి కూడా ఒకప్పడు టాప్ హీరోయిన్‌ అని తెలుసా?
Next articleఈ చిట్కాలు పాటిస్తే సమ్మర్‌లో కూడా ఇల్లు చల్లగా ఉంటుంది..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.