ఓయ్ సినిమాలో శ్రీలక్ష్మి గా నటించిన ఈ చిన్నపిల్ల గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?

Ads

ఇవాళ ఎక్క‌డ చూసినా ఒక సినిమా పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. అదే ఓయ్. ఈ మధ్య రీ-రిలీజ్ ట్రెండ్ ఎక్కువ అయ్యింది. అప్పట్లో రిలీజ్ అయ్యి హిట్ అయిన సినిమాలు, లేక మంచి టాక్ వచ్చిన సినిమాలని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.

అప్పటి వరకు బేబీ షామిలిగా తెలిసిన నటి హీరోయిన్ గా ఈ సినిమాతో పరిచయం అయ్యారు. దాంతో సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. హీరో సిద్ధార్థ్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అవ్వడంతో అంచనాలు ఇంకా ఎక్కువగా నెలకొన్నాయి. అది కూడా ప్రేమ కథ కావడంతో ఆసక్తిగా ఎదురు చూశారు. దర్శకుడు ఆనంద్ రంగా ఒక కొత్త రకమైన ప్రేమ కథని పరిచయం చేశారు.

love letter to oy movie sandhya jagarlamudi from a netizen

సాధారణంగా ప్రేమ కథ అంటే చివరిలో హీరో హీరోయిన్స్ కలుస్తారు. కానీ ఈ సినిమాలో అలా జరగదు. వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమ అనే సినిమాలో జరిగినట్టే ఇందులో జరుగుతుంది. కానీ ఈ సినిమా విడుదల అయిన సమయంలో హ్యాపీ ఎండింగ్ అనేది ఒక టెంప్లేట్ ట్రెండ్ లాగా ఉంది. దాంతో సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. కానీ సినిమా చూసిన వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఇప్పటికి కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

actor who acted as sri lakshmi in oy movie

Ads

అందుకే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో సురేఖ వాణి కూతుర్ల పాత్రల్లో ముగ్గురు నటించారు. అందులో చిన్నమ్మాయి పేరు శ్రీలక్ష్మి. వీళ్ళు ఆ తర్వాత పెద్దగా వేరే సినిమాల్లో కనిపించలేదు. శ్రీలక్ష్మీ అసలు పేరు నందిని. సోషల్ మీడియాలో నాట్య మయూరి పేరుతో పాపులారిటీ పొందింది. ఇటీవల ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది.

actor who acted as sri lakshmi in oy movie

నందిని క్లాసికల్ డాన్సర్. తన డాన్స్ కి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ లో నాట్య మయూరి పేరుతో ఛానల్ కూడా ఉంది. ఇప్పుడు సినిమా మళ్లీ విడుదల అవ్వడంతో నందిని పేరు మళ్లీ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. నందిని కూడా ఓయ్ సినిమా మళ్లీ విడుదల అవ్వడం తనకి ఆనందంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో తన మీద వస్తున్న పోస్ట్ లని షేర్ చేసింది.

watch video :

ALSO READ : శ్రీమంతుడు నుండి బలగం వరకు.. స్టోరీని కాపీ చేసారనే ఆరోపణలు ఎదుర్కొన్న 11 చిత్రాల జాబితా..!

Previous articleశ్రీమంతుడు నుండి బలగం వరకు.. స్టోరీని కాపీ చేసారనే ఆరోపణలు ఎదుర్కొన్న 11 చిత్రాల జాబితా..!
Next articleవాలెంటైన్స్ డే అంటే ప్రేమ దినోత్సవం అనుకుంటారు..! కానీ దాని వెనుక ఉన్న ఈ చీకటి కోణం గురించి తెలుసా..?