విరూపాక్ష సినిమా తో సిల్వర్ స్క్రీన్ పై మెప్పించిన సోనియా సింగ్ నటించిన.. టాప్ 10 షార్ట్ ఫిల్మ్స్ ఇవే..!

Ads

విరూపాక్ష సినిమాలో సోనియా కనపడి అందరిని బాగా ఆకట్టుకుంది. ఆమె అందర్నీ ఇప్పుడు తనవైపు మళ్లించుకుంది. సాయి ధరమ్ తేజ్ కి విరుపాక్ష సినిమా మంచి హిట్ ని ఇచ్చింది. ఈ సినిమాలో సోనియా పాత్ర చిన్నదైనా కూడా అందరిని బాగా మెప్పిస్తోంది. సోనియా సోనియా సింగ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ బాగా ఉంది. ఈ సినిమా వలన ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈమె అందరికీ సుపరిచితమే. ఈ సినిమాతోనే అందరికీ పరిచయం అయ్యింది అనుకుంటే పొరపాటే.

నాలుగేళ్ల క్రితమే ఈమె అందరికీ పరిచయం. యూట్యూబ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి క్రేజ్ ని సంపాదించుకుంది సోనియా సింగ్. ఈమె నటించిన పది బెస్ట్ షార్ట్ ఫిలింస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  1. షీ అండ్ పీరియడ్స్:

షీ అండ్ పీరియడ్స్ అనే ఒక షార్ట్ ఫిలిం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేసిన షార్ట్ ఫిలిమ్స్ లో బాగా పాపులర్ అయింది ఇది. భార్య పీరియడ్స్ టైం లో ఆమె భర్త ఎలా కేరింగ్ తీసుకున్నాడు అనేదే కథ. ఈ 6 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కి ఏకంగా 11 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

2. నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్:

సోనియా సింగ్ చేసిన షార్ట్ ఫిలింస్ లో ఇది కూడా ఒకటి. తెలుగు రానీ అమ్మాయి వల్ల ఒక అబ్బాయి పడ్డ కష్టాల గురించే ఈ కథ.

3. పెళ్లైన కొత్తలో:

ఈమె యూట్యూబ్ లోనే వెబ్ సిరీసులులో కూడా నటించింది. పెళ్లైన కొత్తలో వెబ్ సిరీస్ లో నటించింది. రెండు సీజన్స్ గా ఇది వచ్చింది. ఇది కూడా ఆమె క్రేజ్ ని పెంచేసింది.

Ads

4. సుజాత సుబ్రహ్మణ్యం:

ఇందులో కూడా నటించింది సోనియా. సోనియా-పవన్ సిద్ధు చక్కటి జంటగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు.

5. అనసూయ రామలింగం:

అనసూయ రామలింగం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది సోనియా. ఇది కూడా ఆమె క్రేజ్ ని పెంచేసింది. సాఫ్ట్ వేర్ అమ్మాయి, మాస అబ్బాయి మధ్య జరిగే రొమాంటిక్ స్టోరీ ఇది.

6. ప్రేమలేఖ:

ఇది కూడా ఈమెకి మంచి పేరు ని తీసుకు వచ్చింది. ప్రేమ లో అప్పుడప్పుడు బాధలు కూడా ఉంటాయి అని ఈ కథ చెప్తుంది.

7. నీవే:

నీవే కూడా ప్రేమ కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ సిరీస్ లో ఆరు ఎపిసోడ్స్ వున్నాయి. సోనియా-పవన్ సిద్ధు ఏ ఇందులో కూడా కలిసి చేసారు.

8. అమ్మ ఆనంద్ ఆవకాయ్:

ప్యూర్ నేటివిటీ టచ్ తో ఈ అమ్మ ఆనంద్ ఆవకాయ్ ని తీశారు. 11 ఎపిసోడ్స్ వున్నాయి ఇందులో. అందరినీ బాగా అలరించాయి.

9. మెడికో గర్ల్ ఫ్రెండ్:

సోనియా యూట్యూబ్ లోకి వచ్చిన స్టార్టింగ్ లో మెడికో గర్ల్ ఫ్రెండ్ లో నటించింది. అలా క్రమంగా అవకాశాలని దక్కించుకుంది.

10. అలివేలు శ్రీనివాసులు:

ఇప్పటి దాకా అలివేలు శ్రీనివాసులు నుండి ఆరు ఎపిసోడ్స్ వచ్చాయి. మిగిలినవి రానున్నాయి.

 

Previous articleనిజ జీవితంలో పార్ట్‌నర్స్‌గా మారిన 10 మంది హీరోహీరోయిన్లు ఎవరంటే..!
Next articleప్లేన్ క్రాష్ అయ్యే ముందు పైలట్ “మే డే” అని 3 సార్లు అన్నారు… కారణం ఏమిటో తెలుసా..?