అల్లు అర్జున్ ‘పరుగు’ హీరోయిన్ ప్రస్తుతం ఏలా ఉందో తెలుసా?

Ads

హీరోయిన్లు సినిమాల్లో అవకాశాలు ఉన్నంత కాలం తమ అందచందాలతో ఆకట్టుకుంటారు. ఒక్కసారి అవకాశాలు తగ్గి సినీ పరిశ్రమ నుండి దూరం అయిన తరువాత కొంతమంది హీరోయిన్ల పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది.

Ads

అప్పటి దాకా వెండితెర పై తమ అందంతో ఆకట్టుకున్న ఈ అందమైన భామలు అటు పైన రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ షీలా ఉన్నట్టు తెలుస్తోంది. షీలా తెలుగులో కొన్ని చిత్రాల్లోనే నటించినప్పటికి, ఆమె అతి తక్కువ కాలంలోనే పాపులరీటిని సంపాదించుకుంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో సోలో హీరోయిన్ గా చేసింది. అయితే ఆ తరువాత చాలా సినిమాలలో రెండో హీరోయిన్ గా నటించింది.షీలా ‘సీతాకోకచిలుక’ అనే మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ గా నిలవడంతో షీలాకు అంతగా పేరు రాలేదు. ఆమె మంచు మనోజ్ తో నటించిన ‘రాజుబాయ్’ తో పేరు తెచ్చుకుంది. దాంతో అల్లు అర్జున్ తో నటించే అవకాశం వచ్చింది. అల్లు అర్జున్ తో నటించిన ‘పరుగు’ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. మస్కా, అదుర్స్ చిత్రాల్లో నటించి అలరించింది. అయితే ఆ సమయంలో హీరోయిన్ల మధ్య పోటీ పెరగడంతో ఆమె ఇండస్ట్రీ నుండి తప్పుకుంది.అటు పైన షీలా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే షీలా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోందంట. కానీ ఆమెకు క్యాన్సర్ ఉన్నట్టుగా షీలా ఎప్పుడూ, ఎక్కడా కూడా బయటపెట్టలేదు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ నయం అవడానికి ట్రీట్ మెంట్ తీసుకుంటుందట. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు తెలుపుతున్నారు. ఆమె ఎవరి సాయం అడగకుండా తన జీవితాన్ని గడుపుతోందంట. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న షీలా ప్రస్తుతం ఒక సూపర్ మార్కెట్ ను నడిపిస్తుందని చెప్తున్నారు. ఆమెకు ఎవ్వరిని సాయం అడగడం ఇష్టం లేదని, అందుకే సూపర్ మార్కెట్ పెట్టుకుని తన కాళ్ళ పై తానే నిలబడే ప్రయత్నం చేస్తుందంట. ఈ విషయం తెలిసినవారు షాక్ అవుతున్నారు. టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ అయిన షీలా పరిస్థితి ఇలా అయిపోయిందేమిటి అనుకుంటున్నారు. షీలా తన లెటేస్టు ఫోటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్తపడుతోంది.

Also Read: పవర్ స్టార్, నందమూరి బాలకృష్ణ మధ్యలో ఉన్న ఈ నటి ఎవరో తెలుసా?

 

Previous articleఅన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ధరించిన హుడీ ధర ఎంతో తెలుసా?
Next articleతెలుగులో ఒకే టైటిల్ తో విడుదలైన అయిన సినిమాలు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.