రాజమౌళి సినిమాల్లో ”ప్రకాష్ రాజ్” ఎందుకు ఉండరు…? కారణం ఇదే..!

Ads

మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. చాలా మంది నటులు ఎంతో బాగా నటిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా చాలా మంది తెలుగు నటులు ఇంకో ఇండస్ట్రీలో కూడా ఎంతో చక్కగా రాణిస్తున్నారు నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

చాలా మంది లెజండరీ నటీ నటులు ఉన్నారు వాళ్లలో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. ప్రకాష్ రాజ్ విలన్ గా తండ్రిగా ఒక మంచి స్నేహితుడిగా చాలా సినిమాల్లో నటించి అందరినీ బాగా ఆకట్టుకున్నారు.

మంచి మనసు ఉన్న వ్యక్తి కింద కూడా నటించి ఆకట్టుకోగలరు మరో పక్క విలన్ గా కూడా నటించి అందరినీ భయపెట్టగలరు. ఇలా ఏ పాత్ర చూసుకున్నా ప్రకాష్ రాజ్ చాలా అందంగా అద్భుతంగా నటిస్తారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ చాలా సినిమాలు చేశారు. ప్రకాష్ రాజ్ చేయని పాత్ర ఉండదు. ప్రకాష్ రాజ్ నటన కి చాలా మంది ఫిదా అయిపోతూ ఉంటారు. ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ప్రకాష్ రాజ్ కి ఉన్నారు. ప్రకాష్ రాజ్ తెలుగులో ఉన్న దాదాపు అందరి పెద్ద డైరెక్టర్ల దగ్గర పని చేశారు.

Ads

కానీ రాజమౌళి దర్శకత్వంలో మాత్రం ప్రకాష్ రాజ్ సినిమా చేయలేదు. రాజమౌళి విక్రమార్కుడు సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్క్రీన్ మీద కనబడతారు ప్రకాష్ రాజ్. ఇక రాజమౌళి చేసిన ఏ సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్ లేరు. ఎందుకు ఇంత మంచి నటుడిని రాజమౌళి తన సినిమాల్లో పెట్టలేదు అనే సందేహం చాలా మందిలో ఉంది మీకు కూడా ఈ సందేహం కలిగిందా..? అయితే వెంటనే క్లియర్ చేసుకోండి… ఈ విషయాన్ని రాజమౌళి ని అడగగా రాజమౌళి ఇలా బదులు ఇచ్చారు.

ప్రకాష్ రాజ్ చేయని పాత్ర లేదు ఇప్పటివరకు అన్ని పాత్రలు చేసేసారు ప్రకాష్ రాజ్. నా సినిమాలో కూడా అదే రకం పాత్ర ఇస్తే జనాలకి బోర్ కొడుతుందని రాజమౌళి అన్నారు. ఆయన చేయని పాత్ర ఏదైనా ఉంటే కచ్చితంగా తన సినిమాల్లో ప్రకాష్ రాజ్ ని పెడతానని రాజమౌళి చెప్పారు. రాజమౌళి ఎలివేషన్స్ కి ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తే ఎంతో బాగుంటుంది. ఆ స్క్రీన్ చాలా అందంగా కనిపిస్తుంది. చాలా మంది ఈరోజు వస్తుందేమో అని చూస్తున్నారు. మరి రాజమౌళి సినిమాలో ప్రకాష్ రాజ్ ఎప్పుడు కనపడతాడో చూడాలి.

Previous articleఎందుకు ”బాలయ్య” ఆ తప్పు చేసారు..? బాబాయ్, అబ్బాయ్ మధ్య అసలు ఏం జరిగింది..?
Next articleమ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌ సతీమణి ఫోటో చూశారా?