ఎందుకు ”బాలయ్య” ఆ తప్పు చేసారు..? బాబాయ్, అబ్బాయ్ మధ్య అసలు ఏం జరిగింది..?

Ads

ఎక్కడ చూసిన నాటు నాటు గురించే మాట్లాడుకుంటున్నారు. నాటు నాటు పాట గురించి తెలీని వారే లేరు. ఆస్కార్ రావడం తో అందరికీ నాటు నాటు పాట గురించి తెలిసింది. అసలు నామినేషన్స్ లో ఓ తెలుగు సినిమా ఉంటుందా అని మనం అంతా అనుకున్నాము. పైగా కేంద్రం కూడా ఆస్కార్ రేస్ లో ఈ సినిమాని ఉంచలేదు. దీంతో చాలా మందికి అనేక సందేహాలు కలిగాయి.

పైగా చాలా మంది చిన్న చూపు చూశారు. అసలు ఈ సినిమా ఆస్కార్ కి వెళ్లడం ఏమిటి..? అంత గొప్ప ఏముంది అని ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు మాట్లాడారు.

కానీ నామినేషన్స్ లో ఉంటుందా లేదా అని సందేహం కలిగిన సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డుని దక్కించుకుంది. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ రావడం నిజంగా గొప్ప విషయం. ఒక పెద్ద రికార్డు ని క్రియేట్ చేసింది. మన తెలుగు సినిమా ఇంత గొప్ప అవార్డు రావడం గర్వించదగ్గ విషయం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకి 95వ ఆస్కార్ అవార్డు వచ్చింది. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించిన విషయం తెలిసిందే. చంద్రబోస్ లిరిక్స్ ని ఇచ్చారు సినిమాటోగ్రఫీని ప్రేమ్ రక్షిత్ ఇచ్చారు. కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ నాటు నాటు పాటని పాడారు.

Ads

నాటు నాటు పాటకి చరణ్, ఎన్టీఆర్ చేసిన స్టెప్పులు అయితే తెగ పాపులర్ అయ్యిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా నాటు నాటు పాటని చూసి డాన్స్ చేస్తున్నారు. టిక్ టాక్ ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో ఈ పాట తెగ వినబడుతోంది. పైగా మొన్న ఒక న్యూస్ పేపర్ లో నాటు నాటు స్టెప్పులు ఎలా వేయాలంటూ స్టెప్పులని లైన్ లో ముద్రించారు. నాటు నాటు ఒక్క పాటనే 30 రోజులు రిహార్సిల్ చేశారట. ఉక్రెయిన్ లో 17 రోజులు షూటింగ్ చేశారు ఎంత కష్టపడ్డారో దానికి తగ్గ ఫలితం ఆస్కార్ ద్వారా వచ్చేసింది. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం.

ఆస్కార్ రావడంతో సెలబ్రిటీలు అంతా కూడా చిత్ర యూనిట్ ని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆస్కార్ గ్రహితలైన కీరవాణి, చంద్రబోస్ ని ప్రశంసలతో ముంచేస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కూడా ఆస్కార్ రావడంతో ఒక లేఖ రాశారు. ఇక ఆ విషయానికి వచ్చేస్తే… బాలయ్య రాసిన లేఖలో ఈ సినిమాకి ఆస్కార్ రావడం గొప్ప విషయమని అభినందనలు అని పేర్కొన్నారు. భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం ఇది అని రాశారు. తెలుగు జాతి తో పాటుగా దేశం గర్వించదగ్గ విజయం ఇది అని రాశారు.

స్వరకర్త కీరవాణికి రచయిత చంద్రబోస్ కి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అని ఈ లేఖలో బాలకృష్ణ రాశారు. కానీ ఎక్కడా కూడా ఎన్టీఆర్ పేరుని ఆయన తీసుకురాలేదు. ఎన్టీఆర్ కూడా ఈ సాంగ్ లో ఒక భాగమే కదా… పైగా సొంత అన్న కొడుకు.. అలాంటిది ఎన్టీఆర్ పేరు ని ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దీంతో అందరూ వాళ్ళిద్దరి మధ్య దూరం ఉందని భావిస్తున్నారు. అందుకే ఆయన పేరు తీసుకు రాలేదని చెబుతున్నారు.

Previous articleచాట్‌జీపీటీని లవర్స్ ఈ రకంగా కూడా వాడేస్తున్నారంట..!
Next articleరాజమౌళి సినిమాల్లో ”ప్రకాష్ రాజ్” ఎందుకు ఉండరు…? కారణం ఇదే..!