బ్రో మూవీని ఆ వర్గం కావాలని టార్గెట్ చేస్తుంది.. నిర్మాత టీజీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..

Ads

పవన్ మరియు సాయిధరమ్ తేజ కాంబినేషన్లో రాబోతున్న సరికొత్త చిత్రం బ్రో. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ మరియు టీజర్స్ మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడమే కాకుండా…మూవీ పై హైపును బాగా పెంచాయి. అయితే మరోపక్క ఈ మూవీపై కావాలని నెగటివ్ కామెంట్స్ చేసే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇక రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం పై ఇంటర్నెట్ ను ఆధారంగా చేసుకుని కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించి వస్తున్నా నెగిటివ్ కామెంట్స్ పై చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కొన్ని విషయాలను రివిల్ చేశారు. నమ్మడానికి వింతగా ఉన్న ఈ విషయాలు ఎంతో షాకింగ్ గా కూడా ఉన్నాయి. దీనితో పాటుగా పీపుల్స్ మీడియా బ్యానర్ భవిష్యత్తులో చేపట్టబోతున్న ప్రాజెక్టుల గురించి కూడా ఆయన వెల్లడించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రో సినిమా కంటెంట్ 70 నుంచి 80 శాతం వరకు బాగున్నప్పటికీ అమెరికాలోని ఒక వర్గం కావాలని కంటెంట్ బాగాలేదని ఈ సినిమాను ట్రోల్ చేస్తుందని విశ్వప్రసాద్ వెల్లడించారు.

Ads

బ్రో మూవీ పై ట్రోలింగ్ ఏ విధంగా జరిగిందో.. ఏ ఐ పి అడ్రస్సుల నుంచి ఈ చర్యలు చేశారు తనకు తెలుసని ఆయన అన్నారు. అసలు బ్రో సినిమా చేయాలి అన్న ఆలోచన ఇప్పటిది కాదని ఓ బేబీ చిత్రం తీసే సమయంలోనే తాను పవన్తో ఈ మూవీ చేయాలని ఫిక్స్ అయినట్లు ఆయన తెలియపరిచారు. రాజకీయాలకు అతీతంగా పవన్ ఐడియాలజీ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది అని ఆయన పేర్కొన్నారు.

బ్రో మూవీ అనేది మాస్ మూవీ కాదని.. కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయదగిన మూవీ అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 2024వ సంవత్సరం ని టార్గెట్ చేసుకొని పది పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలు తీయబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా విడుదల గురించి చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు అధికారికంగా వెల్లడిస్తానని క్లారిటీ ఇచ్చారు.

Previous articleBig Boss Telugu Season 7: ఈసారి అలరించబోతున్న తారలు ఎవరంటే ?
Next articleజీవితంలో సమస్యలు ఎదురైతే.. ”చాణక్యుడు” చెప్పిన ఈ 5 విషయాలు గుర్తుతెచ్చుకోండి..!